మహేష్ బాబు సినిమా కథ కాపీగా రవితేజ డిస్కోరాజా?

0
104
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నాడు. ఇక ఇటీవల ఎన్నో ఆశలతో అయన నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకోవడంతో అయన కెరీర్ ఎంతో డైలమాలో పడింది. ఇక ఆ సినిమా తరువాత కథల విషయంలో కొంత ఆచి తూచి ఆలోచించి అడుగులు వేస్తున్న రవితేజ, ఎట్టకేలకు ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల దర్శకుడు వి ఐ ఆనంద్ సినిమాకు పచ్చ జండా ఊపారు. ఇక ఈ సినిమాకు డిస్కో రాజా అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.
Image result for raviteja and mahesh babu
అయితే ఈ సినిమా కథ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు ఎస్ జె సూర్య కలయికలో వచ్చిన నాని మూవీ కథను పోలి ఉంటుందని అంటున్నారు. అందులో మహేష్ బాబు చిన్నపిల్లాడి నుండి పెద్దవాడిగా మారి తన సమస్యలతు తీర్చుకున్నట్లుగా ఇందులో రవితేజ యువకుడి నుండి వృద్ధుడిగా మారుతాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం వైరల్  అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంతవర్కౌ ఉందొ తెలియాలంటే మాత్రం యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడవలసిందే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here