మార్కెట్ లోకి రియల్మి బడ్జెట్ ఫోన్లు

0
29

బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు తాయారు సంస్థ రియల్మి ఒకే రోజు రెండు స్మార్ట్ ఫోన్ లను  మార్కెట్లోకి  విడుదల చేసింది. ఒకటి రియల్ మీ 3ప్రో , మరొకటేమో రియల్ మీ సీ 2 ఈ ఫోన్లను ఫ్ఫ్లిప్ కార్ట్, రియల్ మీ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చు. రియల్ మీ సీ 2 ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతున్నది. 2జిబి ర్యామ్ 16జిబి రోమ్ ఇందులో 3జిబి రామ్ 32జిబి  రోమ్ ధర రూ.7,999 గా ఉన్నదీ. డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్ రంగులలో ఇది కస్టమర్లకు అందుబాటులో దొరుకుతున్నది. రియల్ మీ సీ  2 మే 15  నుంచి అందుబాటులోకి వస్తుంది. వీటిని ఫ్లిప్కార్ట్, రియల్ మీ స్టోర్ లలో కొనుగోలుచేయవచు.రియల్ మీ సి 2 లో 6.1 అంగుళాల హెచ్ డి స్క్రీన్, వాటర్  డ్రాప్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, 13+2 ఎంపీ డ్యూయెల్ రేర్ కెమెరా ,5ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం, 4000 యంఎహెచ్ బ్యాటరీ, మరియు పేస్ అన్లాక్ ఇందులో ఉన్నాయి. మరొకటి రియల్ మీ 3 ప్రో ధర రూ.13,999 నుండి ప్రారంభమవుతున్నది. 4జిబి రామ్ /64జిబి ఇంటర్నల్ మెమరీ  మెమరీ ఉంటుంది. ఇక 6జిబి రామ్ /128జిబి ఇంటర్నల్ ఉంటుంది. ఈ ఫోన్లు ఏప్రిల్ 24 నుండి ఫ్లిప్కార్ట్, రియల్ మీ స్టోర్ లలో అందు బాటులోకి ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here