భారీగా తగ్గిన “రెడ్ మీ నోట్ 6 ప్రో” ధర…. ఎగబడుతున్న కస్టమర్లు… ఎంత తగ్గిందంటే?

0
35
ప్రస్తుతం మన దేశ మొబైల్ మార్కెట్ లో మంచి పేరు సంపాదించి దూసుకుపోతున్న షియోమీ మొబైల్ సంస్థ నిన్న రెడ్ మీ నోట్ 7 మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక నేడు తమ కంపెనీ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధరను అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. వారు ప్రకటించిన అఫర్ ప్రకారం ఆ మొబైల్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసినట్లయితే మనకు రూ.2799 లకే లభ్యం అయ్యే అవకాశం ఉందని ఎంఐ ఇండియా తమ సామజిక మాధ్యమం ట్విటర్‌లో వెల్లడించింది. అయితే ఇది పరిమితకాల ఆఫర్‌గా ఇటువంటి డిస్కౌంట్‌ అందిస్తున్నట్టు సంస్థ తెలిపింది. అయితే ఇందులో కొన్ని నిబంధనలు వర్తిస్తాయని కూడా పేర్కొంది. అయితే ఇప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ లో రెడ్‌మి నోట్‌ 6 ప్రొ అసలు ధర రూ.13,999గా నే కనిపిస్తుండటం గమనార్హం.
Related image
మరోవైపు హై5 పేరుతో కొద్దిరోజలుగా తన స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్న షావోమి, అయిదవ ఆఫర్‌గా నేడు రెడ్‌మి 6పై కూడా కొంత మేర ధర తగ్గింపును ప్రకటించింది. ఫెంటాస్టిక్‌ ఫ్రైడే పేరుతో1500 రూపాయల దాకా ఆ మొబైల్ పై తగ్గింపును అందిస్తున్నట్టు ట్వీట్‌ చేసింది. దీనిప్రకారం ఎంఐ వారి వెబ్ సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రెడ్ మీ 6 మొబైల్, 3జీబీర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.7999గా అలాగే 3జీబీర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.8999గా వెల్లడించింది. ఇక నోట్ 6 ప్రో పై తాము ప్రకటించినట్లు ధర ఇప్పటికీ కనపడకపోవడంతో కస్టమర్లు సైట్ ను తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది….