అనసూయ నిజస్వరూపం బయటపెట్టిన చమ్మక్ చంద్ర!

0
97
టెలివిజన్ తెరపై ప్రస్తుతం మంచి రేటింగ్స్ మరియు ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్న షోల్లో జబర్దస్త్ ప్రోగ్రాం ఒకటి. ఇక ఈ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్స్ కు మాత్రమే కాదు యాంకర్లు అనసూయ, రష్మీ లకు కూడా ప్రేక్షకుల్లో మంచి పేరుంది. ఇకపోతే వీరిద్దరూ ఇప్పటికీ ఈ షోని తమ అదరకొట్టే యాంకరింగ్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నిన్న ప్రసారమైన జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో చమ్మక్ చంద్ర తాను అనసూయ గా నటించి, ఆమె స్పూఫ్ గా చేసిన స్కిట్ నిజంగా అందరితో విపరీతంగా నవ్వులు పూయించింది. అనసూయ నిలయం పేరుతో అనసూయ మరియు ఆమె భర్త భరద్వాజ్ మరియు కుటుంబాన్ని చూపిస్తూ సాగిన ఆ స్కిట్ లో ముందుగా అనసూయ మేనేజర్ తనకు జీతం పెంచండి మేడం అని అడగడం, దానికి కుదరదని ఆమె చెప్పడంతో, ఆమె అందాన్ని మరియు యాంకరింగ్ ని పొగడడంతో ఉప్పోయింగిపోయిన అనసూయ వెంటనే అతడికి జీతం పెంచే సీన్ నిజంగా కడుపుబ్బా నవ్విస్తుంది.
ఇక తనకు వంట చేయడం రాదని, కూరలో, పసుపు, ఉప్పు, కారం ఎంత వేయాలో అడగడం, ఆపై ఆమె భర్త ఒసేయ్….!నీకు అడగడం, నాకు అంట్లు కడగడమే జీవితం అయిపోయింది అంటూ పంచ్ లు పేల్చడం అందరితో నవ్వులు పూయిస్తుంది .ఇక రాత్రి పడుకున్న సమయంలో కూడా జబర్దస్త్ షోని కలవరించడం, దానితో ఆమె పిల్లలు కొంత భయపడి, నాన్న మాకు అమ్మని చూస్తుంటే భయం వేస్తోంది, మేము ఇంట్లో ఉండము అంటూ వాళ్ళు ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో బయటకు వెళ్లిపోవడం వంటి సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇకపోతే మొత్తంగా అనసూయను కామెడీగా స్పూఫ్ చేసిన ఈ స్కిట్ ఆద్యంతం మంచి ఎంటెర్టైమెంట్ తో సాగి అందరిని అలరించింది అనే చెప్పాలి. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసమే చేసానని, అనసూయ గారికి, భరద్వాజ గారికి తనకు ఈ స్కిట్ చేయడానికి ఒప్పుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు చమ్మక్ చంద్ర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here