ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రముఖ నటుడు చంద్రమోహన్ కూతురని మీకు తెలుసా!

0
103
సినిమా పరిశ్రమలోకి కొందరు అనుకోకుండా వచ్చి, మెల్లగా సక్సెస్ లు సాధించి తమ సినీ కెరీర్ ని మంచి స్థాయికి పెంచుకుని స్థిరపడేవారు కొందరైతే, మరి కొందరు మాత్రం అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినప్పటికీ, ఏదో అలా ఒకటో రెండో సినిమాల్లో మెరిసి, ఆపై తాము అనుకున్న ఫీల్డ్ లోకి వెళ్లి సెటిల్ అవుతుంటారు. ఇదిగో అలా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి, కేవలం ఒకేఒక సినిమా చేసి, తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్న ఒక టాలీవుడ్ హీరోయిన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఆమె మరెవరో కాదు, సప్తపది సినిమాలో నటించిన సబిత. నిజానికి సబితా ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ కు వరుసకు తమ్ముడు కూతురు అవుతుందట. చిన్నప్పటి నుండి చదువుతో పాటు నాట్యం పై ఎక్కువ మక్కువ చూపించే సబితను, ఆమె ఇష్టాలను అర్ధం చేసుకున్న తల్లితండ్రులు, ఆమెకు భరతనాట్యం నేర్పించారట. అయితే ఒకానొక సమయంలో ఆమె నాట్య ప్రదర్శన ఇస్తుండగా చూసిన ప్రముఖ దర్శక దిగ్గజం కె విశ్వనాధ్, ఆమెను సంప్రదించి, నేను ఒక సినిమా తీయబోతున్నాను నువ్వు అందులో హీరోయిన్ గా నటిస్తావా అని అడిగారట.
అయితే అయన ప్రశ్నకు బదులివ్వకుండానే వెళ్లిపోయిందట సబిత. ఇక విశ్వనాధ్ సబిత ఇంటికి వెళ్లి ఆమె తల్లితండ్రులను సంప్రదించి సప్తపది సినిమా కథ విషయం మాట్లాడారట. అయితే మాటల సందర్భంలో చంద్రమోహన్ ఆమె తండ్రికి అన్న వరుస అవుతారనే విషయం తెలుసుకున్న విశ్వనాధ్, వెంటనే చంద్రమోహన్ ని కూడా పిలిపించి కథ చెప్పి ఆ సినిమాలో హీరోయిన్ గా సబితను ఫిక్స్ చేశారట .ఇక ఆ సినిమా ఎంతో ఇష్టపడి చేసినప్పటికీ, సబితకు మాత్రం సినిమాల్లో నటించాలని ఉండేది కాదని, ఆ విషయాన్నీ చంద్రమోహన్ కు ఒకసారి చెప్పిందట. అయితే సప్తపది సూపర్ హిట్ అవడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తుండడంతో వాటిని వదులుకోవద్దని చంద్రమోహన్ ఎంత చెప్పినప్పటికీ, తనకు వేరే గోల్ ఉందని, ఆమె ఇంజనీరింగ్ చదవడానికి విదేశాలకు వెళ్లిపోయారట. ఇక ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఆమె తమ కుటుంబంతో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ స్మృతులను పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here