దర్శకుడి చెంప పగలకొట్టిన రమ్యకృష్ణ… షాక్ లో సినిమా యూనిట్.. మ్యాటర్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
93

నిజానికి ప్రస్తుతం అటు టాలీవుడ్, కోలీవుడ్ వంటి చిత్ర పరిశ్రమల్లో అత్త పాత్రల్లో నటించడానికి ఎక్కువగా సూట్ అయ్యేది ఎవరంటే, ఎక్కువమందికి గుర్తుకు వచ్చే పేరు, అయితే నదియా లేదా రమ్య కృష్ణ. నదియా అత్తారింటికి దారేది సినిమాతో అత్తగా మంచి పేరు కొట్టేస్తే, రమ్యకృష్ణ నా అల్లుడు, శైలజరెడ్డి అల్లుడు సినిమాల్లో అత్తగా నటించి అదరకొట్టింది. వాస్తవానికి వీరిద్దరూ తెలుగువారు కాకపోయినప్పటికీ, ఇక్కడి ప్రజల్లో వీరిద్దరికి మంచి పేరు, మరియు క్రేజ్ ఉందని చెప్పాలి. కొన్నేళ్ల క్రితం కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మెరిసిన నదియా, హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో మంచి పేరు గడించారు. అయితే వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్న నదియా, కొన్నాళ్ల తరువాత పెళ్లి కుదరడంతో సినిమా జీవితానికి అప్పట్లో ఫుల్ స్టాప్ పెట్టారు. ఎంత వయసు పెరిగినప్పటికీ కూడా ఇప్పటికీ తరగని అందంతో సన్నగా నాజూగ్గా కనపడే నదియా ,మిర్చి సినిమాతో మళ్ళి సినిమా రంగప్రవేశం చేసారు.

అయితే రమ్య కృష్ణ మాత్రం హీరోయిన్ అయినప్పటినుండి ఇప్పటివరకు సినిమాల్లో కొనసాగుతూ, తరువాత దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తూ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. ఇక మ్యాటర్ లోకి వెళితే, ఇటీవల ఒక తమిళ సినిమాలో దర్శకుడికి జోడిగా నదియా నటించిందట. అయితే ఆ సినిమాలోని ఒక ముఖ్య సన్నివేశంలో ఆమె ఆ దర్శకుడిని ఆవేశంతో గట్టిగా కొట్టాలట. కాగా ఆ సీన్ తీస్తున్న సమయంలో ఆయన్ని కొట్టడానికి కొంత మొహమాటపడిన నదియా, సీన్ కోసం చాలా టెక్ లు తీసుకుందట. ఇక ఆఖరికి ఆమెతో విసిగిపోయిన సదరు దర్శకుడు, వెంటనే ఆమె స్థానంలో రమ్య కృష్ణను తీసుకున్నారట. ఫైనల్ గా అదే సీన్ షూట్ చేసే సమయం రానే వచ్చిందట. ఇక సీన్లో వున్న విధంగా రమ్యకృష్ణ ఒక్కసారిగా ఆ దర్శకుడి చెంప చెళ్లుమనిపించిందట. అయితే ఆమె అద్భుత నటనకు మెచ్చిన దర్శకుడు సహా స్టాఫ్ మొత్తం చప్పట్లోతో ముంచెత్తారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here