మీకు రేషన్ కార్డు ఉందా…ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ అఫర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
97
దేశవ్యాప్తంగా దారిద్య్ర రేఖకు దిగువన వున్నవారికి జారీ చేసిన రేషన్ కార్డును ఎందరో అదృష్టంగా భావిస్తుంటారు. నిజనికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకుల ద్వారానే తమ జీవనాన్ని గడుపుకుంటూ జీవిస్తున్నవారు దేశవ్యాప్తంగా చాలామందే వున్నారు. ఇకపోతే ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రేషన్ కార్డులు గల్లంతయ్యాయనే విమర్శ ఎదుర్కొన్నాయి ఆయా ప్రభుత్వాలు. అయితే అవన్నీ ఒట్టి పుకార్లని, అంతేకాక ఇప్పటివరకు రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా వాడకంలో వుంటాయని, వాటిని తీసివేయడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇటు తెలంగాణలోనూ రేషన్ కార్డు దారులకు అప్పటివరకు ఇచ్చిన ఐదు కిలోల బియ్యానికి అదనంగా మరొక కిలోను ప్రకటించింది తెలంగాణ సర్కారు. ఈ విధంగా రేషన్ కార్డు దారులకు తమ వంతుగా చేయూతనిచ్చాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇకపోతే మరొక 15రోజుల్లో తెలంగాణాలో నూతన ప్రభుత్వం రానుండడం, ఇక మరోవైపు కొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఎన్నికలు జరగనుండడంతో కేంద్రం రేషన్ కార్డుదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు సమాచారం అందుతోంది. అది ఏంటంటే, ఇప్పటివరకు రేషన్ తీసుకునేవారు, తమ రేషన్ దుకాణానికి వెళ్లి, గంటల తరబడి నిలబడి వాటిని తీసుకోవడం చేసేవారు.
అయితే ఇకపై అటువంటి సమస్యలు ఉండవని, ఇకపై రేషన్ రూపంలో సరుకులు కాకుండా, ఇంటికి నలుగురు వ్యక్తులున్న కుటుంబానికి రూ.700 నేరుగా రేషన్ కార్డుదారులు బ్యాంకు అకౌంట్ లోనే నెల నెలా వేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. అయితే కొద్దిరోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. కాగా దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు, నిజానికి ఈ పద్ధతి తీసుకువస్తే చాలావరకు దిగువ వర్గాల ప్రజలు కేవలం బియ్యం వంటి ఒకటోరెండో సరుకులు మాత్రమే కొనుక్కోగలరని, నిత్యావసరాలు ఆకాశాన్నంటే ధరలున్న ఈ రోజుల్లో ఆ 700తో పేదవాడు ఏ మాత్రం కడుపునిండా తిండి తినగలడు అంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here