సింగర్ బేబీ భర్త గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
133
ప్రస్తుతం సింగర్ బేబీ ఒక పాపులర్ సెలెబ్రిటీ గా మారిపోయారని చెప్పుకోవాలి. ఆమె ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, సంగీత దర్శకుడు కోటి, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి తదితరులను కలిసి వారి మన్ననలు అందుకున్నారు. అంతేకాక సంగీత దర్శకుడు రఘు కుంచె ఆమెతో నిన్న ఒక పాటను పాడించి, దానిని సోషల్ మీడియా వేదికల్లో అప్ లోడ్ చేశారు. కాగా ఆ పాటకు నెటిజన్లు అద్భుతంగా వుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక రాజమండ్రి వద్ద, ఒక చిన్న కుగ్రామంలో రోజూ కూలిపనులు చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న బేబీకి ఒక చెల్లెలు మరియు ఒక అన్న వున్నారు. వారు ఎప్ప్పుడూ బేబీ గొంతువిని ఆమె ఎప్పటికైనా మంచి పేరు సంపాదించాలని కోరుకునేవారట. అయితే ఇన్నాళ్లకు ఆ దేవుడి దయతో బేబీ పేరు అందరికి తెలియడం, ఇలా వరుసగా ప్రముఖులందరూ బేబీ ప్రతిభని మెచ్చుకోవడం చూస్తుంటే, మున్ముందు ఆమె మంచి అవకాశాలు తప్పకుండ దక్కించుకుంటారు అనేది అర్ధం అవుతోంది.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, బేబీ కి చాలా చిన్న వయసులోనే వివాహమైందని, ఆమె భర్త మొదటినుండి తన కుటుంబం గురించి ఏ మాత్రం పట్టకుండా రోజు తాగుతూ ఇంటికివచ్చి తనను నానా ఇబ్బందులకు గురిచేసేవాడట. అంతేకాక అతడు చేసే అప్పులను బేబీ కుటుంబమే దగ్గరుండి తీర్చేదని సమాచారం. ఇకపోతే ప్రస్తుతం బేబీకి హఠాత్తుగా ఇంత పేరు రావడంతో అతడు మెల్లగా భార్యపక్కకు చేరాడనీ, అంతేకాక కాస్త ఇదివరకంటే కుదురుగా ఉంటూ ఆమె కారక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడనీ అంటున్నారు. అంతేకాదు ఒకరకంగా బేబీకి తానే ఒక పర్సనల్ మేనేజర్ వలె వ్యవహరిస్తూ ఆమెకు చేదోడు ఉంటున్నాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అతనిలో వచ్చిన మార్పును చూసి, ఆమె సహా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here