వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేదిక ఫిక్స్…. స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా!|#VVR|telugugaramchai

0
115
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా వినయ విధేయ రామ. ఇక ఇటీవల విడుదల అయిన ఈ సినిమా టీజర్, సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచిందని చెప్పాలి. అంతేకాక మొన్న విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలకు మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో కేవలం మాస్ అంశాలు మాత్రమే కాదు, యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ కి నచ్చే ఎన్నో అంశాలు ఉన్నాయని అంటోంది చిత్ర యూనిట్. అంతేకాక ఇన్ని ప్రత్యేకతలతో వస్తున్న ఈ సినిమా అటు బోయపాటి, ఇటు చరణ్ ఇద్దరి కెరీర్లలో మంచి ల్యాండ్ మార్క్ మూవీ గా నిలిపోనుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా ఆడియో వేడుక తేదికోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఆ తీపి కబురు కాసేపటిక్రితం చెప్పకనే చెప్పింది ఆ చిత్ర యూనిట్. ఇక మ్యాటర్ లోకి వెళితే, ఈ సినిమా ఆడియో వేడుకని ఈనెల 27వ తేదీ సాయంత్రం హైదరాబాద్, యూసఫ్ గూడా ప్రాంతంలోగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఈ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివస్తారని, కావున వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఇప్పటినుండే ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించారట సినిమా యూనిట్. ఇక ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథులుగా వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here