పవన్ సీఎం అవుతారా అన్న ప్రశ్నకు, రేణు ఇచ్చిన సమాధానం ఏంటంటే?

0
712

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయి, ఇటీవల అయన నుండి విడాకులు తీసుకుని ప్రస్తుతం పిల్లలతో కలిసి విడిగా వుంటున్నారు. ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ, తన పిల్లల మరియు తన భవిష్యత్తు గురించే తన ఆలోచన అని, మున్ముందు సినిమాలు తీస్తూ, పుస్తకాలు రచిస్తూ తన జీవితాన్ని గడుపుతూ మంచి పేరు గడించాలనేది తన తపనగా చెప్తున్నారు రేణు. ఇక ఒక ఇంటర్వ్యూ లో పవన్ రాజకీయ జీవితంపై రేణు మాట్లాడుతూ, నిజానికి తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని అన్నారు.

renu desai comments on pawan kalyan politics

అయితే ప్రజలకు తనవంతుగా ఏదో చేయాలనే తపన పవన్ లో తపన మాత్రం ఉందని, ఇక తనవంతుగా అయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే అయన సీఎం అవుతారా, లేదా అనే విషయం మాత్రం తాను చెప్పలేనని అన్నారు.  నిజానికి ఆయనను కేవలం తన పిల్లలకు తండ్రిగానేచూస్తానని, అలానే ఆయన కూడా పిల్లలతో ఎంతో కలిసిపోయి ఆనందంగా ఉంటారని రేణు చెప్పుకొచ్చారు. ఇక తన భవిష్యత్తులో పవన్ పేరు లేకుండా తనకంటూ వ్యక్తిగతంగా గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లు రేణు తెలిపారు. ఇక ప్రస్తుతం పవన్ రాజకీయ జీవితం పై ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారాయి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here