మళ్ళి టిడిపిలోకి రేవంత్ రెడ్డి ?…….మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే|telugugaramchai

0
80
దివంగత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారి పాలన మరియు అయన రాజకీయ విధానాలు మరియు తదనంతరం ఆ పార్టీని మరింత బలోపేతంగా ముదుకుతీసుకెళ్లి పార్టీ ప్రతిష్టను మరింత పెంచిన చంద్రబాబు గారి పాలనపై మక్కువతో 2004లో టీడీపీలో చేరారు అనుముల రేవంత్ రెడ్డి. ఆ తరువాత టీడీపీ తరపున తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గం నుండి పలుమార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యి ఆ ప్రాంతంలో టిడిపికి ఎదురులేదని నిరూపించారు. అంతేకాదు, చాలా ఏళ్ళనుండి అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్న రేవంత్ రెడ్డి, ఇటీవల టీడీపీకి తెలంగాణాలో ప్రాభవం తగ్గడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తాను కేవలం పదవుల కోసమే కాంగ్రెస్ లో చేరలేదు అన్న రేవంత్ రెడ్డి, నిజానికి తెలంగాణాని ఇచ్చిన కాంగ్రెస్ ని మరింతగా రాష్ట్ర ప్రజలకు చేరువచేయాలనే ఉద్దేశ్యంతో మరింత కృతనిశ్చయంతో పార్టీ తరపున పనిచేస్తాను అని అన్నారు.
అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరొక్కసారి కొడంగల్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర రెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు రేవంత్ ను అరెస్ట్ చేయడం మరియు ఆయన్ను ప్రచారం సరిగ్గా చేయనీయకపోవడం కారణంగా ఈ ఎన్నికల్లో అయన ఓటమికి కొంత కారణంగా చెపుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అంతేకాక ఆయన్ని మోసపూరితంగా ఓటమిపాలు చేయడంలో ప్రధాన కుట్ర టిఆర్ఎస్ పార్టీది మరియు కేసీఆర్ ది అని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో అరెస్ట్ కాబడ్డ రేవంత్ రెడ్డి, తరువాత ప్రకటించిన ఫలితాల్లో తాను ఓడిపోయినట్లు తెలుసుకుని కొంత ఆవేదనకు గురయ్యారట. అంతేకాక అయన ఇదివరకు వలె తన కుటుంబసభ్యులతో కలిసిమెలిసి గడపడం లేదనే వాదన వినపడుతోంది. మరియు ఓటమి బాధతో సరిగ్గా అయన బయటకు వచ్చి ప్రజలకు తన మొహం కూడా చూపించలేనంతగా లోలోపల మధన పడుతున్నారని,
కాగా అయన అనుచరుల్లో కొందరు మాత్రం, అయన పార్టీ మారి మళ్ళి టిడిపిలో చేరితే రాబోయే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారని సలహా ఇచ్చారట. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు రాష్ట్రంలో మరొక్కసారి వారికి అధికారాన్ని దక్కనీయకుండా చేసాయి అని వారు అంటున్నారట. అయితే వారి మాటలకు కొంత ఆలోచనలో పడ్డ రేవంత్, అతి త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మళ్ళి టిడిపిలో చెరే విషయమై చర్చలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here