మన మొహానికి రైస్ వాటర్ చేసే మేలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

0
64
మనం తినే నిత్య ఆహార పదార్ధమైన అన్నం మనకు ఎంత మేలు చేస్తుంది అనే విషయాన్నీ పక్కన పెడితే, మనం వాడే బియ్యం వల్ల మాత్రం మన సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగం ఉందని అంటున్నారు సౌందర్య నిపుణులు. ఇక బియ్యపు గింజల్లో వుండే ఎమినో యాసిడ్స్ చర్మం కాంతివంతం అయ్యేలా చేయడం, అలానే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మంపై మంటను కలిగించే చర్యను నిరోధిస్తుంది. అయితే అందుకోసం ముందుగా కొద్దిగా అంటే ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని ఒక పాత్రలో వేసి బాగా నీళ్లు పోసి కడిగి, తరువాత ఆ ఒకకప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి నానబెట్టాలి. అలా ఒక గంటపాటు నానబెట్టిన నీళ్లను ఒక గాజు సీసాలో తీసుకుని మూతపెట్టి, కాసేపు అలానే అందులో ఉంచి, తరువాత ఒక మెత్తటి దూది తీసుకుని దానిని గాజు సీసా ఓపెన్ చేసి అందులోని బియ్యపు నీటిలో ముంచి మొహాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి.
Image result for rice water for skin
ఆపై ఒక పల్చటి మరియు మెత్తటి క్లాత్ తీసుకుని దానిని ఆ బియ్యపు నీటిలో ఒక పదిహేను నిమిషాలపాటు ఉంచి, అనంతరం బయటకు తీసి, పిండకుండా ఉంచి, దానిని మొహంపై మాస్క్ లా వేసుకుని, అది ఎండిపోయేవరకు అలానే మొహం పై ఉంచుకోవాలి. పూర్తిగా ఆ క్లాత్ ఆరిన తరువాత, దానిని మొహం పై నుండి తీసి, మొహాన్ని చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా కనుక కొద్దిరోజుల పాటు క్రమం తప్పకుండా చేసినట్లయితే మన మొహం పై వుండే జిడ్డు, మురికి వంటివి పూర్తిగా పోయి, మొహం ఎంతో కాంతివంతంగా మరియు సాఫ్ట్ గా కనపడుతుంది. అంతేకాదు మనం అలా గాజు సీసాలో తీసుకున్న బియ్యపు నీళ్లు, ఫ్రిజ్జ్ లో పెట్టి ఒక ఐదురోజులపాటు నిత్యం అలానే వాడుకోవచ్చట. సో చూసారుగా ఫ్రెండ్స్, మనకు అందరికి ఉపయోగపడే ఈ మంచి చిట్కాను మీరు కూడా ఆచరించి మంచి ఫలితాలు పొంది మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here