విన్నీ డాన్స్ చూసి షాక్ అయిన రోజా… షాక్ లో జబర్దస్త్ టీమ్!

0
127
ప్రస్తుతం ఈటివి ఛానల్ లో మంచి రేటింగ్స్ మరియు విపరీతమైన ప్రేక్షకాభిమానంతో దూసుకుపోతున్న షో ఢీ జోడి. ఇక ఈ షోలో కొందరు డాన్సర్లు చేస్తున్న డాన్స్ స్కిట్లకు ఫిదా అవుతున్న జడ్జీలు, వారికి మంచి మార్కులు వేస్తున్నారు. పైగా అటువంటి వారి డాన్సులకు ప్రేక్షకులు కూడా విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఇటీవల జరిగిన ఈ షోలో ఒక ఎపిసోడ్ లో జడ్జిల్లో ఒకరైన శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ, సడాన్ గా స్టేజిపై కి వచ్చి ఒక పాటకు డాన్స్ వేస్తున్న ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక విన్నీ డాన్స్ కి షోలో వారందరు విపరీతంగా క్లాప్స్ కొడుతూ హోరెత్తించారు. ఇకపోతే ఆ తరువాత కాసేపటికి స్టేజిపైకి వచ్చిన శేఖర్ మాస్టర్, తన కొడుకుతో కలిసి స్టెప్పులేయడం షో మొత్తానికి మంచి జోష్ నింపింది. ఇక ఈ ఘటనను చూసిన మిగతా జడ్జీలు ఆని మాస్టర్ అలానే హీరోయిన్ ప్రియమణి బాగా ఎంజాయ్ చేసారు.
అయితే విన్నీ డాన్స్ పై నటి రోజా నేడు కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. నిజానికి తనకు శేఖర్ మాస్టర్ డాన్స్ అంటే చాలా ఇష్టమని తనకు తెలిసినంతవరకు మన టాలీవుడ్ లో వున్న అతికొద్దిమంది మంచి డాన్సర్లలో శేఖర్ మాస్టర్ ఒకరని అంటున్నారు. తనకు వీలు దొరికినప్పుడల్లా తాను కూడా ఢీ జోడి ప్రోగ్రాం చూస్తానని, ఇక మొన్నటి షోలో అయన కుమారుడు విన్నీ స్టేజిపైకి వచ్చి డాన్స్ చేయడం తనకు బాగా నచ్చిందని, ఇక ఆ వెంటనే శేఖర్ మాస్టర్ కూడా వచ్చి కొడుకుతో కాలు కదపడం చూసిన తనకు ఎంతో సంతోషం వేసిందని అన్నారట. నిజానికి విన్నీ తండ్రికి తగ్గ తనయుడిని, అంతేకాక తనకు నిజంగా చెప్పాలంటే శేఖర్ మాస్టర్ కంటే కూడా విన్నీనే బాగా డాన్స్ చేసినట్లు అనిపించిందని చెప్పిందట. ఇక రోజా చేసిన ఈ కామెంట్స్ పై పలువురు నెటిజన్లు మరియు శేఖర్ మాస్టర్ అభిమానులు, థాంక్యూ రోజా గారు అంటూ ఆమెకు సోషల్ మీడియా వేదికల్లో కృతజ్ఞతలు తెలుపుతున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here