#RRR మూవీ లో ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఢీ అక్సా ఖాన్…. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు.!

0
259
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలూ ఎంతటి అద్భుత విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిజానికి ఈ సినిమాతో రాజమౌళి ఖ్యాతి దేశ దేశాల వ్యాపించింది. ఇకపోతే గత ఏడాది ఏప్రిల్ లో విడుదలయిన బాహుబలి 2  తరువాత రాజమౌళి ఇప్పటివరకు మరొక సినిమాని మొదలెట్టలేదు. దానికి కారణం అంతపెద్ద విజయం తరువాత ప్రజల్లో తనపై ఎంతో నమ్మకం ఏర్పడుతుంది కనుక, దానిని నిలబెట్టుకునేలా తదుపరి సినిమా ఉండాలని, అటువంటి కథ కోసం ఇన్నాళ్లు వేచి చూసారు రాజమౌళి. ఇక #RRR పేరుతో ప్రచారంలో వున్న అయన తదుపరి సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కథ స్వాతంత్రోద్యమం ముందు సమయంలో జరుగుతుందని సమాచారం.
ఇక ఈ సినిమాని అత్యంత భారీ ఖర్చుతో డివివి ఎంటెర్టైన్మెంట్స్ తో బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11వ తేదీ, 11 గంటల 11 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకకు కొందరు సినీ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త నేడు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. అదేమిటంటే ఇటీవల ఈటివి ఛానల్ లో ప్రసారమైన ఢీ 10 లో ఫైనలిస్టు అయిన అక్సా ఖాన్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. నిజానికి అక్సా డాన్స్ పెర్ఫార్మన్స్ చూస్తుంటే కేవలం డాన్స్ పరంగానే కాదు ఆమెలో మంచి నటి కూడా ఉన్నట్లు చూపరులకు కొంత అర్ధం అవుతుంది.
ఇక ఆమె ఢీ 10 ఫైనల్ లో చేసిన అద్భుత పెర్ఫార్మన్స్  కు ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారట. ఇకపోతే కొద్దిరోజుల క్రితం ఆమెను తన సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా తీసుకోవాలని భావించి ఆమెతో ఒక ఫోటో షూట్ కూడా నిర్వహించారట రాజమౌళి. అయితే ఇదంతా ఎంతో రహస్యంగా జరిగిందని, అక్సా లుక్స్ మరియు స్టైల్ నచ్చడంతో ఈ సినిమాలో ఆమెను తీసుకునేందుకు ఫిక్స్ అయ్యారట రాజమౌళి. ఇక ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మాత్రం ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వచ్చేవరకు వేచిచూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here