RRR మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే?

0
53
బాహుబలి తరువాత దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లోతెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘RRR’. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కాగా ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ట్రైనింగ్ తీసుసుకోనున్నాడట. దానికోసం లియోడ్ స్టీఫెన్స్ అనే ఫిసికల్ ట్రైనర్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ శిక్షణను ప్రారంభించాడు.
Related image
దీనిని బట్టి చూస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here