సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ‘RRR’ మూవీ లీక్డ్ ఫొటోస్!

0
56
బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం తీస్తున్న భారీ మల్టిస్టారర్ మూవీ RRR. బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటోంది. అయితే అన్ని సినిమాల వలె ఈ సినిమాకు కూడా లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటివరకు సినిమాకు సంబందించిన ఎటువంటి ఫొటోస్ బయటకు రాకపోవడంతో, అసలు సినిమా ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కుతోంది అనే దానిపై అందరికి విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఇక కాసేపటి క్రితం ఆ సినిమా కోసం వేసిన సెట్ మరియు కొందరు సైడ్ యాక్టర్స్ నటించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాత కాలం నటి పోలీస్ స్టేషన్, అలానే వెనకాల బ్రిటీషర్ల జండాలు పట్టుకున్న కొందరు యువకులకు సంబందించిన ఫోటోలు కావడంతో, ఆ సినిమా స్వాతంత్య్రానికి పూర్వం నేపథ్యం వున్న కథతో రూపొందుతున్నట్లు మనకు అర్ధం అవుతుంది. అయితే ఫోటోల లీకేజితో RRR మూవీ యూనిట్ తలలు పట్టుకుంటోందట. ఎంత జాగ్రత్త పడుతున్నప్పటికీ కూడా ఈ విధంగా లీకులు జరగడంతో రాజమౌళి కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారట. మరి రాబోయే రోజుల్లో సినిమా స్టిల్స్ బయటకు రాకుండా ఆ సినిమా యూనిట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here