తన రికార్డును తానే బ్రేక్ చేసిన సాయి పల్లవి!

0
80
ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఫిదా మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా అద్భుత విజయంలో సాయి పల్లవిదే కీలక పాత్ర అని చెప్పడంలో  ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందులో వచ్చిండే సాంగ్ అయితే ఆ ఏడాది సూపర్ డూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది. ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 183 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది.
Image result for rowdy baby song telugu
విచిత్రం ఎమిటంటే సాయి పల్లవి, ధనుష్ తో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ, మారి-2లోని రౌడీ బేబీ సాంగ్, వచ్చిండే సాంగ్ పేరిట వున్న రికార్డుని బ్రేక్ చేసి 183 మిలియన్లకు పైగా వ్యూస్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. అలాగే ధనుష్ కొలవరి సాంగ్ 175మిలియన్ వ్యూస్ తో తరువాతి స్థానంలో వుంది. ఇక రౌడీ బేబీ సాంగ్ వ్యూస్తో ఆ పాట మొత్తం సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించి నెంబర్ వన్ సాంగ్ గా అద్భుత రికార్డుని నెలకొల్పింది. ఈ విధంగా సాయి పల్లవి తన రికార్డును తానే బ్రేక్ చేసింది అన్నమాట….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here