ఘోర విషాదాన్ని తలచుకుని క్రిస్టమస్ వేడుకలకు దూరంగా వున్న సమంత!|TeluguGaramChai

0
52
టాలీవుడ్ చుల్ బులి సమంత రూత్ ప్రభు, ఏం మాయ చేసావే సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవడంతో సమంతకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. అక్కడినుండి మెల్లగా తన ఇమేజిని పెంచుకుంటూ వచ్చిన సమంత, అనతికాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారి, ఆ తరువాత అందరూ అగ్రహీరోల సరసన నటించారు. ఇక ఇటీవల నవయువ కథానాయకుడు నాగ చైత్యన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలుగా మారిపోయిన సమంత, ఇదివరకటితో పోలిస్తే అప్పటినుండి సినిమాలు ఒకింత మెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ తరపున కొన్ని సేవ మరియు సామజిక కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తున్నారు. ఇక సినిమాలతో పాటు తన కుటుంబానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే సమంత ఇంట ఇటీవల జరిగిన ఒక విషాద ఘటన వారిలో తీవ విషాదాన్ని నింపింది. సమంతను చిన్నప్పటినుండి ఎంతో ఇష్టపడి చూసుకునే తన ప్రియమైన టీచర్ సెలియా కొద్దిరోజుల క్రితం అనారోగ్య కారణాలతో హఠాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే ఆ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర వేదనకు గురైన సమంత, ఇప్పటికీ కూడా ఆమెతో కలిసి గడిపిన కాలాన్నే గుర్తుచేసుకుంటోందని, అంతేకాక కొన్నాళ్ళనుండి ఆమె ఎంతో ముభావంగా ఉండడం గమనించిన అక్కినేని కుటుంబసభ్యులు, ఆమెను ఆ ఆలోచనల నుండి ఎంత దూరం చేద్దామన్న వీలు కావడంలేదని అంటున్నారు. ఇక ఈరోజు జరగబోయే క్రిస్టమస్ పండుగను కూడా సమంత జరుపుకోలేని పరిస్థితులు కనపడుతున్నాయని అంటున్నారు. అయితే నిజానికి తనకు తల్లితో సమానయిన మనిషిని కోల్పోతే ఎవరైనా అలానే బాధ పడతారని, సమంత అభిమానులు కొందరు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మేడం, మీరు జరిగిన విషాదాన్ని మరిచిపోయి మళ్ళి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here