అంతా..!! అనేలా అమాంతం పెరిగిన సమంత ఆస్తుల విలువ!

0
104
టాలీవుడ్ చుల్ బులి సమంత రూత్ ప్రభు, తొలి సినిమా ఏం మాయ చేసావే సినిమాతో కేవలం ప్రేక్షకులనే కాక, హీరో నాగ చైతన్యను కూడా ఎంతో మాయ చేయడంతో, అప్పటినుండి ఇద్దరూ లవ్ లో మునిగిపోయారు. ఇక ఇటీవల వారి ప్రేమ కథకు తెర దించుతూ, ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరూ ఒక్కటై పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుండి అక్కినేని వారి కోడలుగా మంచి హోదాలో కొనసాగుతున్న సమంత, స్వతహాగా సంపాదించిన ఆస్తుల విలువ తక్కువేం కాదని అంటున్నాయి టాలీవుడ్ సినిమా వర్గాలు. ఒక్కో సినిమాకు దాదాపుగా రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్లవరకు పారితోషికాన్ని అందుకునే సమంత, తన ప్రమోషనల్ బ్రాండ్స్  తో కలిపి, ఏడాదికి దాదాపుగా రూ.10 కోట్లవరకు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 45 సినిమాల్లో నటించిన ఆమె చేతులో ప్రస్తుతం మూడు సినిమాలు వున్నాయి. మరోవైపు ఆమె అంబాసడర్ గా వ్యవహరించే బ్రాండ్స్ రాబోయే రోజుల్లో మరిన్ని చేరనున్నాయట. ఇక హైదరాబాద్ లో సామ్ సొంత ఇంటి ఖరీదు 10 కోట్లు. అలానే ఆమెకు కొన్ని, అత్యంత ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. వాటిలో జాగ్వార్ ఎక్స్ఎఫ్ కారు రూ. 62 లక్షలు, ఆడి క్యూ రూ. 7.70లక్షలు,  పోర్చ్ కార్ రూ.1.15 కోట్లు.
Related image
అలానే  ఖరీదైన అపార్ట్ మెంట్లు, మరియు విల్లాలు ఉన్నాయని అంటున్నారు. చాలా సార్లు ఇండస్ట్రీ అగ్ర నిర్మాతలు సమంతకు పారితోషికానికి బదులుగా అపార్ట్ మెంట్లు కట్టబెట్టారన్న ప్రచారం సాగింది. ఇటీవలే లక్ష ఖరీదైన ప్రముఖ బ్రాండ్ సంస్థ, `చానెల్` మేకప్ కిట్ ని సొంతం చేసుకున్నారు సామ్. తన వ్యక్తిగత పని వాళ్లకు వేలు, లక్షల్లో పారితోషికాలు చెల్లిస్తున్నారు కూడా. ఓవరాల్ గా వీటిన్నంటిని కలుపుకుంటే, సామ్ 100 కోట్లకు పైగా ఆస్తులకు అధిపతి అన్నది ఓ అంచనా. మెయింటెనెన్స్, పన్ను చెల్లింపులు,  సేవకుల జీతాల చెల్లింపులు, అలానే ప్రత్యూష ఎన్జీవో ద్వారా సామాజిక సేవలు వగైరా ఖర్చులు తీసివేసినా ఆమె ఆస్తులు మరింత ఎక్కువే ఉంటాయి అనేది ఓ అంచనా. ఇక దీని ప్రకారం చూస్తే, రాబోయే మరొక నాలుగేళ్లలో ఆమె ఆస్తుల విలువ తప్పకుండ రెండింతలు అవుతుంది అనేది సినీ విశ్లేషకుల మాట. కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here