పవన్ కళ్యాణ్ గన్ సీక్రెట్ బయటపెట్టిన నటుడు……మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
86
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మొదటినుండి టాలీవుడ్ లో కొన్ని విమర్శలు వున్నాయి. ఆయనకు దూకుడెక్కువని, అన్నయ్య చిరంజీవితో పోలిస్తే పవన్ కు కోపం కూడా కాస్త ఎక్కువే అని, అయన అప్పట్లో జానీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో ఒక సీన్ సరిగ్గా చేయలేదని జూనియర్ అరిటిస్టుని కొట్టారని విమర్శలు వచ్చాయి. అయితే ఆయన సన్నిహితులు మరియు ఆయనతో కలిసి పని చేసిన వారు మాత్రం, అవన్నీ ఒట్టి పుకార్లని తేల్చివేసిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇక మొదటినుండి సామజిక సేవ కార్యక్రమాల్లో తనవంతుగా పాల్గొనే పవన్ గురించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది. మ్యాటర్ లోకి వెళితే, ప్రముఖ టాలీవుడ్ నటుడు మరియు మా అధ్యక్షులు అయిన శివాజీరాజా నేడు ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకు చిన్నప్పటినుండి కొన్ని కోరికలుండేవని, ఆ విధంగా తొమ్మిదేళ్ల వయసులో మీనా బిస్కట్ కంపెనీలో జాబు సంపాదించాలని, కొంత పెరిగి పెద్దయ్యాక దుబాయ్ వెళ్లాలని, అలానే ఒకానొక సమయంలో తనవద్ద గన్ ఉంటె బావుండు అని అనిపించేదని అన్నారు.
ఇక తాను ఫామ్ హౌస్ కు వెళ్ళేటపుడు మాత్రమే తన లైసెన్సుడ్ గన్ తీసుకువెళ్తుంటాను అని చెప్పుకొచ్చారు శివాజీ రాజా. ఇక తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వున్న అనుబంధాన్ని బయటపెట్టిన శివాజీ రాజా, పవన్ కు కూడా ఒక పర్సనల్ లైసెన్సుడ్ గన్ ఉందని, అయన మరియు నేను చెన్నైలో వున్న సమయంలో ఇద్దరం కలిసి ఫైరింగ్ కు కలిసి వెళ్లేవాళ్లమని అన్నారు. అంతేకాక పవన్ మాటలను బట్టి ఆయనకు గన్ అంటే ఇష్టమని తెలుసుకున్నానని, అంతేకాదు అయన మంచి షూటర్ కూడా అంటూ పవన్ పై పొగడ్తలు కురిపించారు. ఇక పవన్ గన్ పేల్చడం చూసిన తనకు ఆశ్చర్యం వేసిందని, అందువల్లనే తాను కూడా కొంత భయం వేసిన సమయంలో తాను కూడా గన్ వాడతాను అని చెప్పారు. ఇక ఈ విధంగా శివాజీ రాజా, పవన్ కళ్యాణ్ గన్ వాడకం గురించి బయటపెట్టిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో మరియు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here