విమానంలో యువతిపై అత్యాచారయత్నం

0
98

 

ఈ రోజుల్లో విమానయానం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనితెలిసిందే  . కానీ కొందరు అత్యవసర , లేదా తొందరగా వెళ్లాలని ఈ మార్గాన్ని ఎంచుకుంటారు . విమానం లో ప్రయాణిస్తున్న ఓ యువతీ పై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ దుర్మార్గుడు . ఇక విషయానికొస్తే 18 ఏళ్ల కీర్తి అనే యువతి ఇండిగో విమానంలో చెన్నై నుండి ఢిల్లీ వెళ్లే క్రమంలో ప్రక్కనే కూర్చున్న ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేయబోయాడు .

 

ఈ విషయాన్నితన మామయ్య ప్రశాంత్ రాయ్ ద్వారా పంచుకుంది ఆ యువతీ  . తాను సాక్సులు తీసేసి , బూట్లు తీసేసి తన మీద కాళ్ళు పెట్టాడని , చాలా అందంగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేసాడని , అంతే కాకుండా ముద్దులు పెట్టడానికి కూడా ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది . ఇక తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిసాయా జేస్తూ కీర్తి మామయ్య ఇండిగో యాజమాన్యానికి ట్వీట్ చేసాడు.
ఈ విషయం పై విమాన సంస్థ స్పందిస్తూ మేము ఇలాంటి వారిని అస్సలు  సహించము . అతన్ని పోలీసులకు అప్పగిస్తాం అంటూ ట్వీట్ చేసింది . ఈ విషయం  పై నెటిజన్లు ఇండిగో విమాన సంస్ధమీద ఫైర్ అవుతున్నారు . తమ ప్యాసెంజర్లకు  భద్రత కల్పించవలసిన కనీస బాధ్యత  మీకు ఉందని ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు  .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here