ఎనిమిదేళ్ల చిన్నారిని రేప్ చేసిన పక్కింటి వ్యక్తి…..

0
35

దేశంలో మానభంగాలు,అత్యాచారాలు చాల పెరిగిపోయాయి. పూటకో రేప్, రోజుకో అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా కాకినాడ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఎనిమిది ఏళ్ల చిన్నారిని రేప్ చేశాడు ఓ వ్యక్తి. చిన్నారి ఒంటరిగా  ఆడుకుంటుంది.తనపై కన్నేసిన పక్కింటి వ్యక్తి ఒంటరిగా ఆడుకుంటున్న పాపను చూసి చాక్లేట్ ఇస్తానని పిలిచి తనను గదికి తీసుకెళ్లి ఆ చిన్నారిని రేప్ చేశాడు. ఆ తరువాత ఆ చిన్నారి తండ్రి ఆ పాపకు టిఫిన్ ఇవ్వడానికి ఇంటికి వచ్చాడు. గదిలో ఏడుస్తున్న పాపను చూసి విషయం తెలుసుకొని కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. అయితే స్థానిక పోలీసులు స్పందించకపోవడం డం తో   డిఎస్పీ రవి వర్మ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసు ను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here