వికలాంగురాలి పై లైంగిక దాడి …..

0
32

మన దేశం లో రోజు రోజుకి చాల అరాచకాలు జరుగుతున్నాయి.తాజాగా దేశ రాజధాని అయినా  ఢిల్లీ మరొక సంఘటన జరిగింది. ఢిల్లీ లోని లజ్పత్ నగర్ లో 50సంవత్సరాల మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి జరిగింది. లజ్పత్ నగర్ లోని పార్కులో అపస్మారకస్థితిలో పడి  ఉన్న భాధితురాలిని చూసిన పోలీసులు ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షలు జరిగిన తరువాత ఆమె నుండి స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో పరిగెత్తినట్టు గుర్తించామని, అయితే అతడి ముఖం స్పష్టంగా లేదని సీనియర్  అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలో అనుమానంగా ఉన్న వారిని గుర్తించి విచారించమని డిసిపి చిన్మయి బిస్వాల్ చెప్పారు. కాగా గతంలో ఓ రెస్టారెంట్ లో పనిచేసిన సుధీర్ అనే వ్యక్తి మహిళపై లైంగిక దాడికి  పాల్పడినట్టు విచారణలో అంగీకరించినట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లో సుధీర్ పోనీ ఉన్నాడని, మహిళా ఒంటరిగా ఉన్నట్టు గుర్తించి దారుణానికి ఒడిగట్టినట్టు నిందితుడు చెప్పాడని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here