స్టార్ హీరోల కొడుకులతో శంకర్ భారీ సినిమా?

0
66
తమిళ్ లో స్టార్ హీరోలైన విక్రమ్ మరియు విజయ్ లతో కలిసి గత కొన్నాళ్ల క్రితం దర్శక దిగ్గజం శంకర్ ఒక సినిమా తీయాలని సంకల్పించారట. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ సినిమా పట్టాలెక్కలేదని, ఇక వారిద్దరితో కలిసి ఒక సినిమా తీయాలనే అయన కల, కలలానే మిగిలిపోయిందట. ఇకపొతే ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, త్వరలో శంకర్ విక్రమ్ తనయుడు ధృవ్ మరియు విజయ్ తనయుడు జాసన్ సంజయ్ లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా తీయనున్నారని సమాచారం.
Vijay  Son and Vikram  Son to act in Shankar  next film
నిజానికి గతంలో వీరి తల్లితండ్రులతో తీయాలన్న కోరిక అలాగే ఉండిపోవడంతో ఇప్పుడు శంకర్ వారి తనయులిద్దరికి సరిగ్గా సరిపోయే యూత్ ఫుల్ కథ ఒకటి తాయారు చేసి సిద్దముగా వుంచారట. ఇక ఇప్పటికే రజనితోతీసిన  2.0 సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న శంకర్, తదుపరి కమల్ తో తీస్తున్న భారతీయుడు-2 పై తన దృష్టాంతా పెట్టారని, ఇక ఆ సినిమా చివరిదశకు రాగానే ఈ మల్టీస్టారర్ కథను ఆ హీరోలిద్దరికి వినిపించి తెరకెక్కిస్తారని అంటున్నారు. ఇక దీనిపై మరికొద్ది నెలల్లో శంకర్ నుండి ఒక అధికారిక ప్రకటన కూడా రానుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here