ఇళయరాజాతో పనిచేయకపోవడంపై శంకర్ చెప్పిన షాకింగ్ విషయం!

0
63
టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో లెజెండరీ సంగీత దర్శకుడిగా పేరుగాంచిన ఇళయరాజా 75 వసంతాల వేడుక ఇటీవల చెన్నైలో రెండు రోజులపాటు ఎంతో  ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుకకు పలు సినిమా ఇండస్ట్రీల నుండి ఎందరో సినీ ప్రముఖులు హాజరై ఆయనకు శుభాభినందనలు తెలిపారు. ఇక ఏ ఆర్ రెహమాన్, కోటి, అనిరుద్ వంటి వారు ఆయనకు తమ పాటల రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే రజినీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, విశాల్, ఏ ఆర్ రెహమాన్ ఈ వేడుకలో విశిష్ట అతిథులుగా పాల్గొని ఆయన గొప్పతనాన్ని కీర్తించారు.
Image result for shankar about ilayaraja
ఇక తమిళ దర్శకుడు శంకర్ వేదికపై మాట్లాడుతూ, తనకు ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే ప్రాణమని, అయితే తన తొలి సినిమా జెంటిల్ మ్యాన్ సినిమా టైములో ఇళయరాజాగారితో కలిసి వర్క్ చేయాలనీ అయన ఇంటికి వెళ్లడం జరిగిందని అన్నారు. అయితే అంత గొప్ప వ్యక్తిని నాకు ఇలా మ్యూజిక్ కావాలి, అలా మ్యూజిక్ కావలి అని అడగడం తన వల్ల కాలేదని, అంతేకాక ఆయనను రిక్వెస్ట్ చేయడమే తప్ప, ఆర్డర్ చేయడం కరెక్ట్ కాదని భావించి ఏ ఆర్ రెహమాన్ తో వర్క్ చేసానని అన్నారు. ఆ గౌరవంతోనే ఇప్పటివరకు ఆయనతో పని చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇక శంకర్ చేసిన వ్యాఖ్యలకు ఫంక్షన్ హాల్ మొత్తం విపరీతమైన కేరింతలు చప్పట్లతో మారుమ్రోగిపోయింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here