ప్రభాస్ కు తనతో లింక్ పెట్టడంపై వైఎస్ జగన్ సోదరి షర్మిల ఫిర్యాదు…..మ్యాటర్ ఏంటంటే?

0
109
కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు వైఎస్ షర్మిల ల మధ్య సంబంధం ఉందని, అలానే ఆమెను త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారు అంటూ వార్తలు పుకారయ్యాయి. అయితే ఈ వార్తల్లో  ఏ మాత్రం నిజం లేదని కొందరు కొట్టిపారేసినప్పటికీ మరికొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదూ కదా, నిజంగా వారిద్దరూ ఒకరికి ఒకరు తెలియకపోతే ఇలాంటివి ఎందుకు బయటకు వస్తాయి అంటూ కొందరు వాదించారు. ఇక ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోని షర్మిల, నేడు సిపిని కలిసి ఒక ఫిర్యాదు చేసారు. సోషల్‌మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర​ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిళ ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిళ, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటు కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.  వైఎస్‌ షర్మిళ మీడియాతో మాట్లాడుతూ నిజానికి 2014 ఎన్నికలకు ముందు ఎప్పుడో మొదలు పెట్టి నాకు ఓ సినీ హీరోకు సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారాన్ని చేసింది. ఎన్నికల తరువాత దీనిపై ఫిర్యాదు కూడా చేశాము.
Image result for ys sharmila
పోలీసుల విచారణ అనంతరం, చర్యలు తీసుకోవడంతో కొంత కాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి, కనుక ఈ విషప్రచారానికి మళ్లీ వేగం పెంచారు. వీరి ఉద్దేశం ఒక్కటే నా వ్యక్తిత్వాన్ని కించపరచడం. ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారిమీద, వారి వెనకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కలిశాము. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా భావించడం లేదు. ఇలాంటి రాతలు ఇంకా ఎంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత పైశాచికంగా, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని, మన సమాజం ఆమోదించవచ్చా అని ఆమె ప్రశ్నించారు. ఒక మహా నేతకు బిడ్డకు, అలానే ఒక పార్టీ అధినేత అయిన అన్నకు చెల్లెలిగా, సంఘంలో మంచి హోదాలో వున్న భర్తకు భార్యగా తాను ఈ తప్పుడు రాతలను పెద్దగా పట్టించుకోలేదని, అయితే ఈ కుట్రకు కారకులైన ప్రధాన నిందితులను పోలీసులు త్వరోలనే పట్టుకుని అన్ని నిజాలు బయటకు లాగుతారని, అయితే ఇది కేవలం తన ఒక్కదాని సమస్య కాదని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరి సమస్య అని, తనలానే మరికొందరు మహిళలపై కూడా ఈ విధమైన దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు.  మరి ఈ కేసులో పోలీసులు ఎంతవరకు గట్టిగా చర్యలు తీసుకుని, నిజానిజాలు బయటకు లాగుతారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఆగవలసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here