విశాల్ చేసుకోబోయే అమ్మాయి డీటెయిల్స్…. ప్రత్యేకంగా మీ కోసం!

0
121
పందెం కోడి సినిమాతో మంచి బ్రేక్ సంపాదించిన నటుడు విశాల్ అక్కడి నుండి తెలుగు సినిమాల్లో కూడా తనకు అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆ తరువాత విశాల్ అనేక సినిమాల విజయంతో దూసుకెళ్తున్నారు. ఇక విశాల్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వార్త ప్రస్తతం అటు తెలుగు, ఇటు తమిళ వర్గాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే అయన చేసుకోబోయే అమ్మాయి విశేషాలు నేడు బయటకొచ్చి వైరల్ గా మారాయి.
అయితే తమది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని.. ప్రేమ వివాహమని విశాల్  ఇదివరకే తెలిపాడు. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ కూడా జరగనుందని, ఇరువైపుల పెద్దలు త్వరలోనే కలుసుకుని ఎంగేజ్‌మెంట్‌కు డేట్ ఫిక్స్ చేస్తారని సమాచారం అందుతోంది. ఇకపోతే, విశాల్ చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల ముద్దుల కుమార్తె… ఇక అనీషా ప్రస్తుతం తన తండ్రితో పాటు అయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారట. అయితే విశాల్ నడిగర్ సంఘం కొత్త భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అతిత్వరలో అనీషా, విశాల్ ఎంగేజ్‌మెంట్  సమయంలో పెళ్లి డేట్ కూడా ప్రకటించనున్నారు. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here