శేఖర్ మాస్టర్ కొడుకు విన్నీ ఎవరిదగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
107
సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తైతే, ఇక్కడికి వచ్చాక తమ టాలెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించి మెల్లగా అవకాశాలను పొంది పైకి రావడం మరొక ఎత్తు. ఇక అలా మొదట్లో ఎంతో కష్టపడి పైకి వచ్చి, ప్రస్తుతం మంచి డాన్స్ మాస్టర్ గా పేరుతెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. తన 17ఏళ్ళ వయసులో రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ లో శిక్షణ తీసుకున్న శేఖర్, ఆ తరువాత ఈటీవీ ఛానల్ లో వచ్చిన ఢీ 5 ప్రోగ్రాం విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇకపోతే ఆ తరువాత శేఖర్ మాస్టర్ ఢీ10 ప్రోగ్రాం కి జడ్జి వచ్చాడు, అంతేకాక ప్రస్తుతం ఈటీవిలోనే వస్తున్న ఢీజోడి షోకి కూడా జడ్జిగానే కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల పండుగల సందర్భంగా ఈటివి ఛానల్ ప్రసారం చేసిన కొన్ని షోల్లో కూడా సందడి చేసి అందరినీ ఉర్రూతలూగించిన శేఖర్ మాస్టర్ భార్య పేరు సుజాత, వారికి ఒక కొడుకు వున్నాడు. అతని పేరు విన్నీ. ఇక కొద్దిరోజుల క్రితం విన్నీ ఢీ జోడి షోలో తళుక్కున మెరిసి అందరికి షాకిచ్చాడు. ఇక ఆ ఎపిసోడ్ లో విన్నీ వేసిన డాన్సుకు షో మొత్తం దద్దరిల్లిందనే చెప్పాలి. ఇక తన కొడుకు డాన్స్ వేస్తున్న సమయంలో శేఖర్ మాస్టర్ కూడా స్టేజిపైకి వచ్చి అతడితో కలిసి స్టెప్పులు వేయడంతో అందరూ ఒక్కసారిగా చప్పట్లతో షోని మోత మ్రోగించారు.
అయితే విన్నీ డాన్స్ నేర్చుకుంటోంది మరి ఎవరి దగ్గరో కాదు, మరొక డాన్స్ మాస్టర్ అయిన యాష్ మాస్టర్ దగ్గరట. నిజానికి శేఖర్ మాస్టర్ కు బాగా నచ్చిన వారిలో యాష్ మాస్టర్ ఒకరని, తన మాదిరిగానే యాష్ కూడా ఎంతో కష్టపడి పైకివచ్చాడని, అందుకే అతనంటే తనకు ఇష్టమని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు శేఖర్ మాస్టర్. అయితే తన కొడుక్కి డాన్స్ అంటే ఇష్టమని గ్రహించిన శేఖర్ మాస్టర్, తనకు ప్రతిరోజూ షూటింగులు వుండడంతో విన్నీకి దగ్గరుండి బాగా డాన్స్ నేర్పించమని యాష్ మాస్టర్ కి చెప్పారట. శేఖర్ మాస్టర్ వంటి వ్యక్తి తనదగ్గరకు వచ్చి, నాకొడుక్కి డాన్స్ నేర్పు అని చెప్పడం నిజంగా తనకు గొప్ప అదృష్టమని, అందుకే వెంటనే విన్నీకి శిక్షణ ఇవ్వడానికి సిద్దమయ్యాడట యాష్ మాస్టర్. ఇక అప్పటినుండి ఇప్పటివరకు విన్నీకి బాగా డాన్స్ లో తర్ఫీదు ఇచ్చిన యాష్ మాస్టర్, ఈ రోజున విన్నీకి మంచి పేరు రావడానికి కారకుడయ్యాడట. ఇక ప్రస్తుతం ఈ వార్త తెలుసుకున్న కొందరు నెటిజన్లు యు అర్ రియాలీ గ్రేట్ యాష్ మాస్టర్ అంటూ ఆయనపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here