సెల్ఫీ తీసుకునే వారికి షాక్ ఇచ్చే వార్త!  

0
90
ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ లేని వారు దాదాపుగా లేరనే చెప్పాలి. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ధరలు రోజురోజుకు మరింత తగ్గుతుండడంతో వాటిని వినియోగించేవారు ఎక్కువ అవుతున్నారు. ఇక చేతిలో ఫోన్ ఉంటే చాలు, తమని తాము రకరకాల ఫోజుల్లో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తున్నారు.  అయితే ఆ విధంగా సెల్ఫీ లు దిగుతున్న వారిలో యూత్‌ మాత్రమే కాదు సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు అని తేడాలేకుండా అందరూ సెల్ఫీప్రియులే అని చెప్పాలి. అయితే ఆ మితిమీరిన అభిమానం మానసికస్థితిపైనా ప్రభావం చూపుతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం మందగించడానికి, ఆందోళన పెరగడానికి సెల్ఫీలు కారణమవుతున్నాయని ఇస్తటిక్‌ క్లినిక్స్‌ అనే వైద్య సంస్థ ఒక అధ్యయనంలో వెల్లడించింది. ఆ ఆందోళనతో కాస్మెటిక్‌ సర్జరీ చేయమంటూ ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగిందని సదరు సంస్థ పేర్కొంది. మరోవైపు మీరు రోజూ కనీసం మూడు సెల్ఫీలను తీసుకుంటే ప్రమాదానికి దగ్గరగా ఉన్నట్లేనని అమెరికన్‌ సైకియాట్రిక్‌ అసోసియేషన్‌ (ఏపీఏ) అంటోంది.
Related image
ఇదొక మానసిక సమస్య అంటూ, దానికి సెల్ఫీటి్‌సగా పేరు కూడా పెట్టేసింది.   మనం దిగే ప్రతి మూడు ఫొటోల్లో ఒకటి దశాబ్ద కాలంలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ అత్యంత పాపులర్‌ మార్గమైంది. ముఖ్యంగా యువత నడుమ! 18-24 ఏళ్ల వ్యక్తులు తీసుకుంటున్న ప్రతి మూడు ఫొటోల్లో ఒకటి సెల్ఫీ ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా రోజూ 100 మిలియన్ల సెల్ఫీలు నమోదవుతున్నాయని గూగుల్‌ పేర్కొంటోంది. సెల్ఫీలను అధికంగా దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వల్ల సమస్యలు కూడా వస్తున్నాయంటున్నారు. సెల్ఫీ పిచ్చి కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోతున్నవారు, ఆందోళనతో సతమతమవుతున్న వారూ అధికంగానే ఉంటున్నారని చెబుతున్నారు పరిశోధకులు. పర్సనాలిటీ, సోషల్‌మీడియా వినియోగం నడుమ సంబంధం తెలుసుకోవడానికి ఈస్థటిక్‌ క్లీనిక్స్‌ దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. అయితే అమ్మాయిలే సెల్ఫీలను అధికంగా తీసుకుంటూ సెల్ఫీటిస్‌గా మారుతున్నారట. ఇక ఈస్థటిక్‌ క్లీనిక్స్‌ చేసిన అధ్యయనంలో 65శాతం మంది మహిళలు, 62శాతం మంది పురుషులు సెల్ఫీల కారణంగానే కాస్మెటిక్‌ సర్జరీలకు నిర్ణయించుకున్నామని వెల్లడైందట.
Image result for selfies
మూడేళ్ల క్రితం మన దేశంలో జరిపిన మరో అధ్యయనంలో గ్రూప్‌ సెల్ఫీల్లోనూ మహిళల వాటానే అధికమని, సగటున నెలకు 6 గ్రూప్‌ ఫొటోలు అమ్మాయిలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటే, అబ్బాయిలు 3 ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నట్లు వెల్లడైంది. మనలో అధికమవుతున్న యాంగ్జైటీ డిజార్డర్లు, ఒకరకంగా పదే పదే సెల్ఫీలు తీసుకోవడం వల్ల కూడా కారణం అవుతున్నాయని, వారి మీద వారికి నమ్మకం లేకపోవడం ఓ కారణమని సైకాలజి్‌స్టలు చెబుతున్నారు. అదే పనిగా సెల్ఫీలు తీసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వల్ల యాంగ్జైటీ డిజార్డర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు  అయితే ఆరోగ్య నిపుణులు చెపుతున్న ప్రకారం ఫ్రంట్‌ ఫేస్‌ కెమెరాలను బ్యాన్‌ చేయాలి. సెల్ఫీ వల్ల కలిగే పరిణామాలను తెలుపుతూ ప్రచారం నిర్వహించాల్సిన అవసరమూ ఉందని, అలానే సెల్ఫీల పోస్టింగ్‌ వల్ల వారిలో వచ్చిన మార్పులు, తమ శరీరాకృతిని మార్చుకోవాలనుకుంటున్న వారి మానసిక స్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. కాబట్టి, ఎప్పటికపుడు మనలో సెల్ఫీలు తీసుకుని మన ప్రొఫైల్ ఫొటోస్ మార్చాలి అనే స్థితి మనలో ఉంటే, దానిని ఇప్పటినుండే మార్చుకునే ప్రయత్నం చేయాలనీ, అప్పుడే సెల్ఫీ పిచ్చి నుండి బయటకు రాగలమని హెచ్చరిస్తున్నారు…….
Image result for selfies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here