హనీ ఈజ్‌ ది బెస్ట్‌ పాప గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలు! 

0
119
అనుకోకుండా దర్శకుడు అనిల్ రావిపూడిని కలిసిన హన్సిక. ఇక ఆయనతో కలిసిన సమయంలో తన మ్యానరిజమైన హనీ ఈజ్ ది బెస్ట్ పదాన్ని ఆయనతో తన స్టయిల్లో చెప్పడం, దానిని గ్రహించిన దర్శకుడు అనిల్ గుర్తుపెట్టుకుని మరీ తన సినిమాలో వాడడం జరిగింది. ఆ విధంగా హన్సిక కొంత గుర్తింపు సంపాదించింది. విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటించిన ఎఫ్‌–2 చిత్రంలో నటి మెహ్రీన్‌ నోట వచ్చే హనీ ఈజ్‌ ది బెస్ట్‌ అనే పదానికి మూలం ఈ చిన్నారి. ఎఫ్‌–2 చిత్ర దర్శకులు అనిల్‌ రావిపూడి చెప్పిన మేరకు విజయనగరంలో మున్నా డ్యాన్స్‌ అకాడమీలో హనీ ఈజ్‌ ది బెస్ట్‌ అనే కవర్‌సాంగ్‌ను హనీ చేయడానికి  హైదరాబాద్ రావడం జరిగింది.
Image result for honey is the best f2
నిజానికి రాజా ది గ్రేట్‌ మూవీ పది రోజుల పాటూ షూట్‌ చేస్తున్న సమయంలో అప్పుడు డొకోమో యాడ్‌ సాంగ్‌ వచ్చేది. అందులో హనీ, డొని అంటూ వెటకారంగా వచ్చే సందర్భంలో హన్సిక అలా కాదంటూ హనీ ఈజ్‌ బెస్ట్‌ అంటూ అందరికీ తన మేనరిజంతో అలవాటు చేసింది. ఇది చూసిన దర్శకులు, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు ఇదేదో బావుందంటూ ఫాలో అయ్యారు. నిర్మాత దిల్‌రాజ్‌ తన చిత్రంలో  హనీ ఈజ్‌ బెస్ట్‌  మేనరిజాన్ని హీరోయిన్‌కి  ఉపయోగిస్తానంటూ కాపీరైట్స్‌ అందించారని చిన్నారి తల్లి గీతా సుందర్‌ తెలిపారు. కాగా ప్రస్తుతం హన్సిక టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here