ధోని పై భారీ జరిమానా

0
32

ఐపీఎల్ 12 వ సీజన్ స్టార్ట్ అయ్యింది . దాదాపు చాలా మ్యాచ్ లు జరిగేశాయి . ఇక నిన్న ధోని చేసిన పనికి 50 శాతం కొత్త విధించారు . ఇక విషయానికొస్తే గురువారం జైపూర్ వేదికగా జరిగిన చెన్నై మరియు రాజస్థాన్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 151 పరుగుల వద్ద ముగించింది . ఇది చేధించే క్రమంలో మొదట్లోనే వికెట్లు కోల్పోయిన చేనై తర్వాత అంబటి రాయుడు , ధోని లు గ్రీజులో నిలదొక్కుకోవడం తో రన్రేట్ ను బాగానే తీసుకొని వచ్చారు . చివరి 3,4 ఓవర్లు ఉన్నయనగానే రాయుడు వికెట్ చేజారింది .

ఇక గ్రీజులో ఉన్న ధోని బాగానే ఆడుతున్నాడు . అతనికి తోడు జడేజా రావడం తో ఇద్దరి భాగస్వామ్యం బాగానే ఉంది . ఇక చివరి క్షణాల్లో ధోని బోల్డ్ అయిపోయాడు . ఇక తర్వాతి స్థానం లో వచ్చిన సాంట్నర్ 3 బంతుల్లో 8 రన్స్ చెయ్యాల్సిన స్థితిలో బెన్ స్టోక్ ఒక నోబ్ బాల్ వేశాడు దానికి అంపైర్ మొదటగా నోబ్ బాల్ అని చెప్పి తర్వాత కాదని చెప్పడం తో , ధోని పెవిలియన్ కు చెరినప్పటికీ మల్లి స్టేడియం లోకి వెళ్లి అంపైర్ లతో వాగ్వాదానికి దిగాడు . అయినా అంపైర్ లు ఎం చెప్పకపోవడం తో వెనుదిరిగాడు ధోని . ఇక విషయం లో ధోని కి ఆ మచ్ ఫీజ్ లో 50 శాతం జరిమానా విధించారు . దీనిపై సోషల్ మీడియా లో ధోని పై విమర్శలు గుప్పిస్తున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here