సింగర్ బేబీ నిజస్వరూపం తెలిస్తే షాక్ అవుతారు!

0
92
ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరుకు చెందిన దినసరి కూలి అయిన సింగర్ బేబీ, ప్రస్తుతం తన గాన మాధుర్యంతో పలువురు సినీ ప్రముఖుల నుండి అభినందనలు అందుకుంటున్నారు. నిజానికి ఏ మాత్రం అక్షర జ్ఞానం లేని బేబీ రోజూ తాను పొలం పనులు  చేసుకునే సమయంలో తనకు వచ్చిన కొన్ని పాటలను పడుతూ తన పనిచేసుకుంటూ వెళ్ళేది. అయితే ఆమె పాటలను విన్న కొందరు కూలీలు, నువ్వు ఇంత అద్భుతంగా పాడుతున్నావు, నువ్వు రోజూ ఇక్కడికి వచ్చి మా కోసం పాటలు పాడి వెళ్ళు, పని మాత్రం చేయవద్దు, నీకు రోజు కూలి మేము ఇస్తాం అని చెప్పేవారట. అయితే అలా వూరికే కూలి తీసుకోవడం ఇష్టం లేని బేబీ, ఖాళీ సమయంలో మాత్రం వారికి తన పాటలు వినిపించి ఆనందపరిచేదట. ఇక ఒకరోజు తన పక్కింటి అమ్మాయి పాడుతున్న పాటలో అపశృతి దొర్లిందని గమనించిన బేబీ, పాపా… నీ పాటలో తప్పు ఉంది, నేను ఒకసారి చూపిస్తాను, నువ్వు కూడా అలానే పాడు అని ఆ పాట మొత్తం పాడి వినిపించిందట. అయితే ఆమె గాత్రాన్ని, పాట పాడే పద్దతిని చూసి ఒకింత ఆశ్చర్యపోయిన ఆ అమ్మాయి, వెంటనే ఆమె పాట పాడిన వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిందట. అయితే ఆ వీడియోని మెలమెల్లగా ఒకరొకరుగా చూడడం, ఆపై బేబీ గానమాదుర్యాన్ని వారు గ్రహించడం, అంతేకాక కొందరు సినీ ప్రముఖులు సైతం ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోవడం జరిగిపోయాయి. ఇక అక్కడినుండి ఎవరి నోటా విన్నా బేబీ మాటే.
 అయితే ఆమె గొంతుకను మెచ్చిన మెగాస్టార్ భార్య సురేఖ, చిరంజీవి గారికి చెప్పి బేబీ ని ఇంటికి పిలిపించారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా తన అద్భుత సంగీతంతో అందరిని అలరిస్తున్న సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సైతం బేబీ పాట విని మంత్రముగ్ధులై ఒక ట్వీట్ కూడా చేయడం గమనార్హం. ఇక బేబీ, ఇంట్లో మొదటినుండి తన చెల్లెలు, మరియు సోదరుడికి అన్ని పనుల్లో చేదోడువాదోడుగా ఉండేదట. అలానే తల్లితండ్రులకు సాయం అందించడానికి రోజుకూలికి వెళుతూ, వచ్చిన డబ్బులను వారికోసం ఖర్చుచేసేదట. ఒక్కోసమయంలో కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదని, అటువంటి సమయంలో మాత్రం దేవుడు ఏదైనా మంచి దారి చూపిస్తే బాగుండు అని అనుకునేవారట బేబీ. అయితే ఇన్నాళ్లకు దేవుడు కరుణించి తనకు ప్రజలకు తన గొంతుకతో సేవచేయాలని ఆఙ్ఞాపించాడని, అంతేకాక తనకు ఇంత మద్దతునిస్తున్న సినీ ప్రముఖులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటోంది బేబీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here