సింగర్ బేబీకి మెగాస్టార్ ఇచ్చిన బహుమతి చూస్తే షాక్ అవుతారు!

0
112
ఎక్కడో రాజమండ్రి దగ్గర ఒక మారుమూల పల్లెటూళ్ళో దినసరి కూలీగా పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకునే బేబీ, నేడు తన గాత్ర మాధుర్యంతో ప్రజలు, ప్రముఖులు అభినందనలతో ఏ విధంగా దూసుకెళ్తున్నారో మనం చూస్తూనే వున్నాం. ఇకపోతే తనకు జన్మనిచ్చిన తల్లితండ్రుల తరువాత తన టాలెంట్ ని గుర్తించి, తనను మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లి, తన జన్మ చరితార్థం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి  ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటోంది సింగర్ బేబీ. ఇక ఆమె ఇటీవల మెగాస్టార్ ఇంటికి వెళ్లడం, ఆయనను మరియు అయన సతీమణి సురేఖ గారిని కలిసి వారి ఆతిధ్యం స్వీకరించడం జరిగింది. ఇకపోతే మెగాస్టార్ ని చూసిన బేబీకి ఒక్కసారిగా కళ్ళు చమర్చాయని, తన జీవితం ఈరోజుతో ముగిసిపోయినా పర్లేదని బేబీ ఆ సమయంలో చెప్పారట.
అయితే మొదట బేబీ టాలెంట్ గురించి పలు సామజిక మాధ్యమాల్లో విన్న మెగాస్టార్ గారి సతీమణి సురేఖ గారు, ఎలాగైనా బేబీని మన ఇంటికి పిలిచి తనకు మంచి బహుమతి ఇచ్చి ప్రోత్సహించాలని భావించారట. ఇక ఆమె అడిగిన వెంటనే కోటిని సంప్రదించిన మెగాస్టార్, కోటి గారి ద్వారా ఆమెని ఇంటికి పిలిపించారు. ఇక ఆమెకు ఆతిధ్యమిచ్చిన మెగా దంపతులు, ఆమెకు ఒక ఖరీదైన చీరను, మరియు ఒక లక్ష రూపాయల చెక్కును కూడా అందచేశారట. అయితే ఈ విషయాన్ని నేడు ప్రజలతో ఒక ఛానల్ తో మాట్లాడుతూ కోటి చెప్పారు. ఇక మరొక సంగీత దర్శకుడు రెహమాన్, సింగర్లు ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు కూడా బేబీని కలిసి తమవంతుగా ఆమెకు కొంత ఆర్ధిక సాయం అందించారని, రాబోయే రోజుల్లో ఆమెకి సింగర్ గా మంచి అవకాశాలు రావడం ఖాయమని కోటి అభిప్రాయపడ్డారు. కాగా మెగాస్టార్, బేబీ కి ఇచ్చిన గిఫ్ట్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here