వినయ విధేయ రామలో ఆ సీన్లు తొలగింపు!

0
32
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా సినిమా కొంత మిశ్రమ స్పందనతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో దర్శకుడు బోయపాటి తీసిన కొన్ని సన్నివేశాలు కొంత నమ్మశక్యంగా లేవని, అలానే గతంలో వచ్చిన కొన్ని సినిమాల్లోని సీన్స్ కంటే ఇవి మరింత దారుణంగా ఉన్నాయని, ఇక దర్శకుడు ఇటువంటి సీన్లు పెట్టడానికి సిద్ధమైతే, హీరో చరణ్ ఎలా ఒప్పుకున్నారని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.
Image result for vinaya vidheya rama
ఇక సినిమాకు కూడా కొంత నెగటివ్ టాక్ రావడంతో, ఆ సీన్స్ వల్ల సినిమాకు ఎటువంటి నష్టం కలగకూడదని భావించిన సినిమా యూనిట్ వారు, నేటి నుండి సినిమాలోని ఒక సీన్ తొలగించడం జరిగిందట. అదేమిటంటే, విల‌న్ చేతిలో చిక్కుకున్న చరణ్ అన్న‌య్య అయిన ప్ర‌శాంత్‌ ఫోన్ చేయగానే, ఎయిర్ పోర్ట్ అద్దాన్ని బ‌ద్ద‌లు కొట్టుకుని రామ్‌చ‌ర‌ణ్ ప‌రుగు ప్రారంభిస్తాడు. ఇక ఓ బ్రిడ్జి మీద నుంచి రైలు మీద‌కు దూకేసి ఏకంగా వైజాగ్ నుంచి నేపాల్ బోర్డ‌ర్ వ‌ర‌కు అలాగే నిల్చుని వెళ్లిపోతాడు. ఈ సీన్ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కు గుర‌వుతోంది. దీంతో ఈ సీన్‌ను చిత్ర‌బృందం సినిమా నుంచి తొలగించింది. మరి దీనివల్ల సినిమా కలెక్షన్లు ఎంతవరకు పెరుగుతాయో చూడాలి….