ఎస్పీ బాలు గారి హరికథ ఆవేదన!

0
76
ప్రముఖ గాయకులూ మరియు సంగీత దర్శకులైన శ్రీ ఎస్పీ బాలు గారు, నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసిన హరికథ వైభవోత్సవాలు కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హరికథలకు కూడా ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వాలని అన్నారు. దానికి ప్రధాన కారణం, నేటి కాలంలో మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపే హరికథలు అంతరించిపోవడమేనని అన్నారు.
రోజురోజుకు మనిషి మన సంస్కృతులను పూర్తిగా మర్చిపోతున్నాడని, ముఖ్యంగా మన తెలుగును పూర్తిగా చెంపేస్తోంది మన వారే అంటూ అయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఇటువంటి అద్భుత కళను గుర్తించి పద్మ అవార్డు కనుక ప్రకటిస్తే, రాబోయే రోజుల్లో ఇటువంటి అద్భుత సంప్రదాయాలు నేటి యువతకు కొద్దిగా అయినా గుర్తుకువస్తాయని, అదే ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో హరికథలు చెప్పేవారు అంటే ఎవరు అని అడిగే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here