పవన్ కళ్యాణ్ అంటే ఎవరు?.. నాకు తెలియదు : శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

0
94
ఇటీవల టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై నానా రాద్దాంతం చేసిన వర్ధమాన తెలుగు నటి శ్రీ రెడ్డి, ఆ తరువాత కొంత పాపులరయింది. ఇక అప్పట్లో పవన్ కళ్యాణ్ పై కూడా ప్రత్యక్షంగా విమర్శలు చేసిన ఆమె ప్రస్తుతం మరొక్కసారి నాగబాబు, బాలకృష్ణ ల ఎపిసోడ్ లోకి మధ్యలో వచ్చినట్లుగా అర్ధం అవుతోంది. ఇక నేడు తన ఫేస్ బుక్ లో ఆమె పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అంటూ ఒక వీడియో పెట్టింది, నన్ను కొందరు మేడం పవన్ గురించి మీకు తెలిసింది చెప్పండి అని అడిగారని,
Related image
అయితే తనకు పవన్ బన్వాల్ అనే పెయింటింగ్ ఆర్టిస్ట్ గురించి బాగా తెలుసునని, అయన చాలా గొప్ప పెయింటర్ అని, అయన పెయింటింగ్స్ నేను కూడా ఇదివరకు చాలాచూసాను సూపర్బ్ అంటూ కితాబిచ్చారు. ఇక తనకు అంతకుమించి వేరొక పవన్ అనే వ్యక్తి గురించి తెలియదని అన్నారు. అయినా రాష్ట్రంలో పిచ్చి పిచ్చి మాట్లాడు మాట్లాడుతూ, టైం పాస్ చేస్తూ, అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తూ వుండే పవన్ లు ఎంతో మంది వుంటారు, అటువంటి వారి గురించి నాకు తెలియదు మరి అంటూ పవన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. కాగా శ్రీ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అయి సంచలనం సృష్టిస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here