మరోసారి నానిని టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి…జెర్సీ సినిమాపై సంచలన కామెంట్స్

0
116

శ్రీ రెడ్డి మరోసారి నానిని టార్గెట్ చేస్తూ సంచలన కాంమెంట్స్ చేసింది. నాని నటించిన సినిమా జెర్సీ ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ గా  నాని  హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు. ఈ  సినిమా ఏప్రిల్ 19న విడుదల అయ్యింది. అన్ని ఏరియా లలో పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకు పోతున్నది. ఈ సినిమాలో నాని నటనను చూసి టాలీవుడ్ హీరోలు సైతం నానిని ప్రశంసలతో ముంచ్చుతున్నారు.

ఎన్టీఆర్,అల్లుఅర్జున్,విజయ్ దేవరకొండ, రాజమౌళి నాని నటనను మెచ్చుకుంటున్నారు. నాని తనదైన నటనతో లవర్,భర్తగా, తండ్రిగా బాగా నటించాడు. రంజీ క్రికెటర్ గా చాల బాగా నటించాడు. తాజాగా నాని జెర్సీ సినిమా పై తనదైన పంచులతో శ్రీ రెడ్డి రెచ్చిపోయింది. సినిమాలో చూసినట్టు మంచి వాడు కాదని తనలో ఇంకో కోణం ఉందని చెప్పింది. అది మాత్రమే కాదు జెర్సీ సినిమా హిట్టయినందుకు ఎం కర్మరా బాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీ రెడ్డి నాని ఇంతలా టార్గెట్ చేసిన నాని మాత్రం మౌనం గానే ఉన్నాడు. కానీ నాని ఫాన్స్ మాత్రం శ్రీ రెడ్డి పై మండి పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here