అదరగొడుతున్న ‘శ్రీదేవి బంగ్లా’ ట్రైలర్ … చూస్తే మతిపోతుంది!

0
98
గత ఏడాది గూగుల్ లో సెర్చ్ చేసిన సెలెబ్రెటీల్లో కన్ను కొట్టి కుర్రకారును తనవైపునకు తిప్పుకొన్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఓరు ఆధార్ లవ్ సినిమాలోని ఒక సాంగ్ లో ప్రియా చేసిన కన్నుకొట్టిన మూమెంట్ తో ఆమె విపరీతమైన క్రేజ్ సాధించింది. నిజానికి అప్పటికి ఆ సినిమా విడుదల కూడా కాలేదు. ఇక ప్రస్తుతం ఆమె నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’. ఈ చిత్ర ట్రైలర్‌ నేడు విడుదలైంది. ఈ చిత్రానికి ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియా పాత్ర పేరు శ్రీదేవి. ఓ చిన్న పిల్లకి ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న సన్నివేశంతో ట్రైలర్‌ మొదలవుతుంది.
Image result for sridevi bungalow trailer
మీకు ఇష్టమైన నటి ఎవరు అని ఆ చిన్నారి అడగ్గా, నాకు ఇష్టమైన నటి నేనే అని ప్రియా సమాధానమిస్తుంది.  ఇందులో ఆమె రీల్‌ లైఫ్ హీరోయిన్‌గా నటించారు. ఓ నటిగా నేను చాలా అదృష్టవంతురాలిని. నాకు జీవితంలో దేవుడు పేరు, డబ్బు, సంతోషం అన్నీ ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు. కానీ? అన్న డైలాగ్‌‌ వినిపిస్తున్న సమయంలో కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. ఆ తర్వాత ప్రియా ఓ పక్క ఏడుస్తూ మరోపక్క మద్యం తాగుతున్నట్లు కన్పించారు. చివర్లో బాత్‌టబ్‌లో ఓ శవం కాళ్లు చూపించడంతో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో దివంగత నటి శ్రీదేవిని కించపరుస్తూ ఆమె పేరుకు భంగం వాటిల్లే చేసారని ఆమె భర్త బోనీ కపూర్ సినిమా దర్శక నిర్మాతలపై కేసు వేయడం గమనార్హం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here