శ్రీదేవి కూతురిపై రేప్ అటెంప్ట్….ఏమి జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
135
ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక సాధారణ ప్రజలు సహా, ఎందరో ప్రముఖులు సైతం తమకు సంబందించిన వ్యవహారాలు, అలానే తమ వ్యక్తిగత విషయాలను ఎప్పటికపుడు వాటిలో పోస్ట్ చేస్తూ తమ అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇది ఒకరకంగా మంచిదే అయినప్పటికీ కొందరు నెటిజన్లు వాటిని అలుసుగా తీసుకుని, తమకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం అక్కడక్కడా చూస్తున్నాం. ఇక అచ్చంగా ఇటువంటి పరిస్థితి శ్రీదేవి కూతుళ్ళు జాహ్నవి, అన్షులాల విషయంలో జరిగింది. ఇక మ్యాటర్లో లోకి వెళితే, ఇటీవల శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, కొడుకు అర్జున్ కపూర్, మరొక కూతురు అన్షులా ఈ ముగ్గురూ ఒక ప్రముఖ జాతీయ ఛానల్ నిర్వహించే కాఫీ 2విత్ కరణ్ అనే ప్రోగ్రాం లో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ఆ షోకి హోస్ట్ మరియు బాలీవడ్ దర్శకుడు అయిన కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు జాహ్నవి, అర్జున్ కపూర్ లు ఇద్దరూ పోటాపోటీగా సమాధానాలు ఇచ్చారు. ఇక షోలో అక్క జాహ్నవిని గెలిపించడానికి అన్షులా చాలా సాయపడ్డారు కూడా.
ఇక షోలో చివరికి వారిద్దరిపై అర్జున్ విజయం సాధించాడు. అయితే ఈ షో ముగిసిన తరువాత కొందరు నెటిజన్లు జాహ్నవిని బాగా ఆడావు అని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం నీ చెల్లెలు అన్షులా నీకు ఏ మాత్రం సాయం చేయలేదు, అటువంటి అమ్మాయిని రేప్ చేయాలి అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయడంతో జాహ్నవి కొంత ఆవేదన చెందిందట. అంతేకాక సోషల్ మీడియా వినియోగంలో కొందరు హద్దు దాటి తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం హేయమైన చర్య అని, కనీసం తమ మొహం చూపించుకోవడానికి కూడా అర్హత లేని వ్యక్తులు ఇటువంటి చౌకబారు కామెంట్స్ చేయడం ఎంతవరకు సబబని ఆమె ఆగ్రహం  వ్యక్తం చేసారు. ఇక ఈ మ్యాటర్ తెలుసుకున్న అర్జున్ కపూర్, తన చెల్లెళ్లపై ఈవిధంగా పరుష వ్యాఖ్యలు చేయడం తాను ఏ మాత్రం సహించనని, అంతేకాక ఆ కామెంట్  అక్కకు, చెల్లికి ఇటువంటి పరిస్థితి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు ఆగ్రహిస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here