శ్రీజ రెండవ పాపని చూసి మొదటి పాప ఏం చేసిందో తెలుసా?|#Srijakonidela|telugugaramchai

0
101
మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ అప్పట్లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే 2007లో ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్న ఈ జంట, ఆ తరువాత కొన్ని మనస్పర్థలు రావడంతో ఇటీవల విడాకులు తీసుకుని ఒకరినుండి మరొకరు విడిపోవడం జరిగింది. అయితే అప్పటినుండి పుట్టింట్లోనే ఉంటున్న శ్రీజకు కొన్నాళ్లక్రితం కళ్యాణ్ దేవ్ తో రెండవ వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా శిరీష్ మరియు శ్రీజలకు అప్పటికే ఏడేళ్ల పాప వుంది. ఇక కళ్యాణ్ తో వివాహ అనంతరం నిన్న శ్రీజ, మరొక బిడ్డకు జన్మనించింది. ఇక ఈ వార్తను విన్న మెగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికల్లో అభినందనలు తెలియచేస్తున్నారు.
అయితే తమ ఇంట మరొక పాపాయి జన్మించడంతో మొదటి పాప ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోందని, తనతో కలిసి ఆడుకోవడానికి ఒక చెల్లి దొరికినందుకు ఆ పాప ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తోందట. నాన్న మరియు అమ్మ నన్ను బాగా చూసుకుంటున్నారని, ఇక కొత్తగా చెలి రాకతో ఆ ఆనందం మరింత రెట్టింపయిందని సంబరపడుతోందట. అయితే కూతురు మరొక బిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగిపోయిందని, అందునా నిన్న క్రిస్మస్ పండుగ కావడంతో వారి ఇంట సంబరాలు మరింత అంబరాన్ని అంటాయని అంటున్నారు. అంతేకాదు  చరణ్ మరియు ఉపాసన దంపతులు శ్రీజకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెల్పుతూ పుట్టిన బిడ్డకు కొన్ని బహుమతులు కూడా ఇచ్చారట. ఇక ప్రస్తుతం యూరోప్ టూర్ లో వున్న పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలియగానే శ్రీజ దంపతులకు ఫోన్ లో అభినందనలు కూడా తెలిపినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here