వెంకటేష్, కమల్ హాసన్ తో బ్రహ్మోత్సవం దర్శకుడి ‘కూచిపూడి వారి వీధి’

0
110
దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్లుగా అప్పట్లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా అద్భుత విజయాన్ని అందున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాతోనే శ్రీకాంత్ అడ్డాల టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనంతరం అయన మహేష్ బాబుతో తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీకాంత్ కు మంచి పేరొచ్చింది. అయితే ఆ వెంటనే వరుణ్ తేజ్ తొలి సినిమాగా అయన తీసిన ముకుంద ప్లాప్ అయింది. అయినప్పటికీ కూడా ఆయనకు మహేష్ బాబు ఒక అవకాశం ఇవ్వగా, ఆయన బ్రహ్మోత్సవం అనే సినిమా తీశారు. అయితే అప్పట్లో ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో శ్రీకాంత్ పేరు పూర్తిగా మర్చిపోయారు ప్రేక్షకులు.
Related image
ఇక మళ్ళి ఇన్నాళ్లకు శ్రీకాంత్‌ అడ్డాల భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో కమల్‌ హాసన్‌, వెంకటేశ్‌ కథానాయకులుగా నటించనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారట. అంతేకాదు ఈ సినిమాకు ‘కూచిపూడి వారి వీధి’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరి ఈ నూతన ప్రాజెక్టుతో అడ్డాల ఎలాంటి సక్సెస్ ని అందుకుంటారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here