సహాయ నటుడుగా చేయడం కష్టం అంటూ బాధపడ్డ స్టార్ హీరో!

0
63
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి విషయంలో ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమే, ఎందుకంటే ఏ సినిమా ఆడుతుందో, ఎవరికి ఎటువంటి పేరు తీసుకువస్తుందో ఎంతటి దిగ్గజాలైనా చెప్పలేరు. అందుకే కొందరు సినిమాలు కూస్తో ఒకరకంగా జూదం వంటివే అని అంటుంటారు. ఇక పోతే ఎన్నో సంవత్సరాల పాటు హీరోగా నటించి, రాణించిన నటుడు ఇప్పుడు సహాయ నటుడి పాత్రలను పోషించడం గుండెలను పిండేసే విషయమని అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానించారు.
Image result for abhishek bacchan
తాజాగా ఆయన ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో తాను సైడ్ క్యారెక్టర్ చేసిన ‘మన్మర్జియా’ చిత్రం ప్రస్తావనకు వచ్చిన సమయంలో అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.  హీరోగా చేసే వారు సైడ్ క్యారెక్టర్ గా చేయాల్సి రావడం చాలా కష్టమైన విషయమని, సినీ ఇండస్ట్రీ చాలా దారుణమైన ప్రదేశమని అన్నారు. ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదని, రోజులు గడుస్తుంటే పరిస్థితి మారిపోతుందని అన్నారు. ఆ బాధ నుంచే స్ఫూర్తి పొందాలని, తిరిగి మరింత ఎదిగేందుకు కృషి చేయాలని అన్నాడు. ఇక అభిషేక్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here