బిగ్ బాస్ సీజన్ -3 కి టాలీవుడ్ స్టార్ హీరో….. ఎవరో తెలుసా?

0
61
ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ 2 సీజన్స్ ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాయనే చెప్పాలి. ఇక ఈ షో సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, నాచురల్ స్టార్ నాని రెండవ సీజన్ కు హోస్ట్ గా చేసారు. అయితే నిజానికి ఎన్టీఆర్ చేసిన సీజన్ 1 తో పోలిస్తే, ఇటీవల జరిగిన సీజన్ 2 పై కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు మంచి రేటింగ్స్ తో దూసుకెళ్లిన సీజన్ 2 తరువాత మూడవ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై వీక్షకులు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు.
Related image
నిజానికి ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా నాగార్జున ను తీసుకుందామని భావించినప్పటికీ, అయన పెద్దగా ఆసక్తి చూపలేదని, అంతేకాక ఇటీవల తాను మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసానని, కావున తనకు ఈ షో చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారట. అయితే షో నిర్వాహకులు చివరికి విక్టరీ వెంకటేష్ ని తీసుకోవాలని నిర్ణయించారని, ఆమేరకు ఇటీవల అయనను సంప్రదించడం కూడా జరిగిందని అంటున్నారు. అయితే వెంకటేష్ కూడా బిగ్ బాస్ చేస్తానని కొంత సుముఖంగా తన అభిప్రాయాన్ని తెలిపారారని సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఒకవేళ నిజమే అయితే వెంకీ ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈ వార్త విషయమై ఆ షో నిర్వాహకుల నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here