ఒకరినొకరు పొడుచుకున్న స్టార్ హీరోల అభిమానులు….. మ్యాటర్ తెలిస్తే షాక్ అవడం ఖాయం!

0
69
నిజానికి సినిమా అనేది కొన్నెళ్ల క్రితం మనిషికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఉపయోగపడే సాధనంగా ఉండేది. ఇక మొదట్లో కేవలం సినిమాని అందులోని పాత్రలను, కథని మాత్రమే చూసే ప్రేక్షకులు మెల్లగా అందులోని హీరోలను మరియు హీరోయిన్లను అభిమానించడం వారికి అభిమానులుగా మారిపోవడం జరిగాయి. ఇక ప్రస్తుతం దాదాపుగా అందరు ఎవరో ఒక హీరోకి లేదా హీరోయిన్ కి అభిమానులుగా వుంటున్నారు. ఇక ఈ అభిమానం అనేది కొంత హద్దు మీరానంత వరకు పర్వాలేదు కానీ, మితిమీరి అవతల హీరోల అభిమానుల ను తిట్టడం వంటివి చేస్తే మాత్రం, అది మరింత ముదిరి వారి ప్రాణాలను కూడా తీసేలా వారిని తాయారు చేస్తుంది. ఇక ప్రస్తుతం సంక్రాంతి సీజన్ ని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన పేట, విశ్వాసం సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకుని దూసుకుపోతున్నాయి. మొదటి నుండి తమిళనాట అజిత్, విజయ్, రజినీకాంత్ అభిమానుల మద్య ఎప్పుడూ కొంత గొడవ నడుస్తూనే ఉంటుంది. అయితే ఈ రెండు సినిమాలు ఆడుతున్న మల్టీ ప్లెక్స్ మరియు పక్క పక్కన థియేటర్ల వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడినది.
Image result for ajith and rajini fans fight
తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రెండు వర్గాల వారు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారు. రెండు సినిమాలు విడుదలైన పలు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వేలూరులోని ఓ థియేటర్ ముందు ఇరు వర్గాల అభిమానులు కత్తులతో ,కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో దాదాపు అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారని పదిమంది పాక్షికంగా గాయాలపాలయ్యారని తమిళ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కత్తులతో దాడి నేపథ్యంలో వెలూరు మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక పోలీసుల రంగప్రవేశంతో ఆ రెండు వర్గాలు కొంత శాంతించాయి. నిజానికి స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే పరిస్థితి ఏంటో అక్కడి వారికి తెలిసి వచ్చింది. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హీరోలదే అని పలువురు ప్రజలు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here