వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ కామెంట్స్ ….. వింటే ఆశ్చర్యపోతారు!

0
52
బాలీవుడ్ నటి కంగనా రనావత్ గురించి మన తెలుగు వారికీ కూడా అంతగా పరిచయం అవసరం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ అనే సినిమాలో నటించి మెప్పించారు. ఇకపోతే ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక సినిమా మణికర్ణిక. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించినప్పటికీ, చివర్లో కొంత వర్క్ బ్యాలన్స్ ఉన్నప్పటికి అయన మరోవైపు బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కోసం మాణికర్ణికాను చివర్లో కంగనాకు అప్పగించడం జరిగింది. అయితే సినిమా పూర్తి అయ్యే సమయంలో తనకు చెప్పకుండా కంగనా కొన్ని మార్పులు చేసిందని, అది రేపు సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుందని ఇటీవల చెప్పుకొచ్చారు.
Image result for kangana ranaut
ఇక అప్పటినుండి కంగనా, క్రిష్ మధ్య మాటల యుద్ధం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇక సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడంతో, కంగనా నిన్న కొందరు మీడియావారికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ,తనను అనవసరంగా బలిపశువును చేసి, లేనిపోని విధంగా తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తున్నారని, అలానే సినిమాని తాను ఏ మాత్రం చెడకొట్టలేదని, అయినప్పటికి క్రిష్ తనపై నిందలు వేయడం చాలా బాధగా ఉందని ఆమె అన్నారు. ఇక ఆమె మాట్లాడుతూ, తనకు అందరి జీవితాల గురించి తెలుసునని, త్వరలోనే తనపై మాటల రాళ్ళు రువ్విన వారి జీవితాలు బయటపెడతానని, అప్పుడు తన నిజాయితీ అందరికి తెలుస్తుందని హెచ్చరిస్తోంది. ఇక కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ఇన్ డైరెక్ట్ గా క్రిష్ ని ఉద్దేశించి చేసినవే అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో అభిప్రాయపడుతున్నారు  …..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here