వాహనదారులకు డిసెంబర్ 1 నుండి గడ్డుకాలమే… మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
72
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు విధాలుగా రకరకాల చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు ఎప్పటికపుడు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే ట్రాఫిక్ రూల్స్ ని కూడా మరింత కఠినతరం చేస్తూ ఎప్పటికపుడు ట్రాఫిక్ అధికారులు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మనం నడిపే వాహనాలకు వుండే నంబర్ ప్లేట్ల విషయమై రేపటినుండి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమల్లోకి రానున్న ఒక కొత్త రూల్ గురించి మీకు తెలుసా… తెలియకపోతే ఈ వీడియో చూడండి…ఇక మ్యాటర్ లోకి వెళితే, మనం ఏదైనా వాహనం కొనుగోలు చేసినపుడు దానికి సంబంధించి నంబర్ ప్లేట్ ని కొద్దిరోజుల తరువాత వాహన అధికారులు మనకు జారీ చేయడం జరుగుతుంది. అయితే వారు మనకు కేటాయించిన నంబర్ ప్లేట్లను మార్చి కొందరు, వాటిని రకరకాల రంగులకు మార్చడం, అలానే తమకు నచ్చిన హీరోల పేర్లు, దేవుళ్ళ పేర్లు, రాజకీయనాయకుల పేర్లు వంటివి వాటికి చేరుస్తున్నారు.
ఇక రేపటినుండి ఇటువంటివి ఎవరి వాహన నంబర్ ప్లేట్ పైనైనా కనబడితే గట్టి శిక్షే పడుతుందట. ఇక మనం బండి కొన్నప్పుడు జారీ చేసిన తెలుపు లేదా నలుపు రంగు నంబర్ ప్లేట్ మాత్రమే ఇకపై వినియోగించాలని, ఒక వేళ ఆ నియమాన్ని తప్పి నంబర్ ప్లేట్ లో మార్పులు చేర్పులు చేసి మొదటిసారి దొరికిన వారికి రూ.2000 రూపాయల జరిమానా, రెండవసారి రూ.5000 రూపాయల జరిమానా, మూడవసారి దొరికితే వారి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ రూల్ తీసుకురావడానికి కారణం, ఏదైనా నేరం జరిగినపుడు ఆ నేరాలు చేసిన వారిని పట్టుకునే సమయంలో నంబర్ ప్లేట్ లో మార్పుల కారణంగా వారి వాహననంబర్ ని గుర్తించలేకపోవడమేనట. సో విన్నారుగా ఫ్రెండ్స్, మరి మీ నెంబర్ ప్లేట్ లో కూడా ఏవైనా మార్పులు జరిగి ఉంటే, ఇకనైనా వాటిని సరి చేసుకోండి మరి.