మానసిక ఒత్తిడితో ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థి

0
25

నా చదువు కోసం మా అమ్మానాన్న చాల కష్టపడుతున్నారు. దానికి తగిన న్యాయం చేయలేకపోతున్నాను. వారిని నవ్వులపాలు చేయలేక చనిపోతున్నాను. అని ఓ విద్యార్థి ఇంగ్లీషులో లెటర్ రాసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  హైదరాబాద్ శివారు లోని ఘటకేసర్ లో ఓ పప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అతడిది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామం.అతని పేరు అల్లు పవన్ 19 ఏళ్ళ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.. తనకు చదువు చాల ఇబ్బందికరంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. గత నెలలో బోనకల్లులో తన స్నేహితుడి వద్దకు వచ్చాడు. అతడితోనే ఉంటూ ఇంటికి వెళ్లలేక అక్కడే ఉంది కుమిలిపోయేవాడు. తన తల్లిదండ్రులు ఫోన్ చేసి తన యోగ క్షేమాలు ఎదిగిన హైదరాబాద్ లో ఉన్నానని చెప్పేవాడు. తన స్నేహితుడి రెండస్థుల భవనం పై నుంచి గురువారం రాత్రి దూకేశాడు. తలకు,కళ్ళకు, చేతులకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. స్థానికుల సహాయంతో అతడిని హాస్పిటల్ కి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు ఫలితం లేక అతను  మరణించాడు. ఘటన స్థలం నుంచి అతడి జేబులో ఉన్న మరణ వాగ్మూలం లేఖను స్వాధీనం చేసుకున్నారు. అతడి  స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు అతడి మృతి దేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here