ఎవడి గోల వాడిది షోలో సుధీర్ చేసిన రచ్చ చూస్తే ఆశ్చర్యపోతారు!

0
140
ప్రస్తుతం టివి ఛానల్స్ వారు ఎప్పటికప్పుడు రకరకాల కొత్త కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక ఏవైనా ప్రత్యేక రోజులు మరియు పండుగల సమయంలో మరింత వెరైటీ షోలతో ఎప్పటికపుడు టీఆర్పీలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఇటీవల ఈటీవి ఛానల్ వారు వరుసగా పండుగల సందర్భంగా ప్రసారం చేసిన ప్రోగ్రాం లు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుని వారి ఆదరాభిమానాలతో మరియు మంచి రేటింగ్ లతో ముందుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం త్వరలో రానున్న కొత్త సంవత్సరం సందర్భంగా ఆ ఛానల్ వారు ప్రసారం చేయనున్న కొత్త ప్రోగ్రాం ఎవడిగోల వాడిది. ఇక ఈ షో తాలూకు ప్రోమోని నిన్న యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఇక నిన్నటినుండి ఈ ప్రోమో మంచి వ్యూస్ తో అదరగొడుతోంది. అయితే ప్రోమోలో జబర్దస్థ్ మరియు ఢీ జోడిలోని స్టార్స్ తమ తమ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు.
ఇక సుడిగాలి సుధీర్ ప్రోగ్రామ్ మొదట్లో మాట్లాడుతూ ఎవరైనా షోలో యాంకరింగ్ చేస్తే ఎంటర్టైన్మెంట్ గ్రాముల్లోనో లేక కిలోల్లోనో ఉంటుంది, అదే ఈ సుధీర్ గడు యాంకరింగ్ చేస్తే ఎంటర్టైన్మెంట్ తన్నులు టన్నుల్లో ఉంటుంది అంటూ సరైనోడుతో డైలాగును పోలినట్లు చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇకపోతే ప్రోమోలో రాజమౌళి ఎప్పటిలానే తాగుతూ పడిన సాంగ్, అలానే షోలో కోండహెరు డాన్సర్లు అడిగా అడిగా సాంగ్ ని పాడడం, ఇక మెగాస్టార్, ఎన్టీఆర్, ఏఎన్నారై సినిమాల్లోని ఫేమస్ సాంగ్స్ కి గెటప్ శ్రీను మరియు భానుశ్రీ చేసిన డాన్సులు సూపర్బ్ గా వున్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఈ ప్రోమో మొత్తాన్ని చూస్తే రాబోయే కొత్త సంవత్సరం రోజున ప్రసారం కాబోయే ఈ ఎవడిగోలవాడిది ప్రోగ్రామ్ మంచి జోష్ తోసాగనుందని అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here