జీవితంలో ఎన్నో కష్టాలు పడిన సుధీర్ జీవితం గురించి తెలిస్తే… కన్నీళ్లు ఆగవు!

0
421
ఈటివిలో ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, చలాకి చంటి, చమ్మక్ చంద్ర,,, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది నటులు ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ ఆర్టిస్టులుగా మారారంటే దానికి ఆ ప్రోగ్రాం ఒక ముఖ్య కారణం. నిజానికి కొన్నాళ్లక్రితం కాస్త తక్కువగా రేటింగ్స్ వస్తున్న ఈటీవికి మంచి బూస్ట్ ఇచ్చిన షో జబర్దస్త్. ఇక షోలో అందరిలానే మంచి పేరు సంపాదించిన వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. నిజానికి మొదట చిన్నచిన్న మ్యాజిక్కులు మరియు ఫన్నీ టాస్కులు చేసే సుధీర్ మెల్లగా కొన్ని స్కిట్స్ లో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుని స్వయంగా తానే స్కిట్స్ ప్రిపేర్ చేసుకునే స్థాయికి ఎదిగాడు సుధీర్. ఇక సుధీర్ తల్లితండ్రులు ఇటీవలి సరైనోళ్లు షోకి వచ్చి ఆడియన్స్ తో తమ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి చెప్పుకొచ్చారు. సుధీర్ కు ఒక తమ్ముడు మరియు చెల్లెలు వున్నారు.
నిజానికి వారిద్దరికీ మంచి భవిష్యత్తు ఇచ్చి, వారిని జీవితంలో ఎంతో వృద్ధిలోకి తీసుకురావాలని సుధీర్ ఎప్పుడూ తపనపడుతుండేవాడని అతని తల్లితండ్రులు చెపుతున్నారు. అంతేకాదు, సుధీర్ తండ్రి ఒక మధ్యతరగతి  ఉద్యోగి అని, అలానే వాళ్ళ అమ్మ కూడా కుటుంబ పోషణార్ధం రోజూ పొలం పనులకు వెళ్లి ముగ్గురుని కష్టపడి చదివించారని తెలుస్తోంది. ఇక తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితి చూసి చెలించిపోయిన సుధీర్, తాను ఏదోవిధంగా కష్టపడి  ఆదుకోవాలని హైదరాబాద్ బయల్దేరి వచ్చాడట. తన నలుగురు స్నేహితులతో కలిసి హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడ్డాడని, నిజానికి ఆ సమయంలో తన వద్ద తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండేదని, అయితే అటువంటి పరిస్థితుల్లో తన మిగతా స్నేహితులే సుధీర్ ని ఆడుకున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here