బతుకమ్మ పాటను అవమానించిన ప్రదీప్, సుధీర్, రష్మీ…మండిపడుతున్న నెటిజన్లు!|Garam Chai

0
109
ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న మంచి క్రేజీ షోస్ లో బాగా ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్న షోల్లో ఢీ జోడి షో కూడా ఒకటి. ఇక ఈ షోలో యాంకర్లుగా చేస్తున్న సుధీర్, రష్మీ, ప్రదీప్ లు షోని మంచి సక్సెస్ చేయడంలో కీలకపాత్ర పోషించారని చెప్పాలి. ఇక ప్రతివారం షోలో ఎవరో ఒకరు అతిథులు ప్రత్యేకంగా రావడం, అలానే షోలో సందడి చేయడం వంటి వాటితో ఈ షోకి టిఆర్పి రేటింగ్స్ కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక నిన్న ప్రసారమైన ఈ వారం ఎపిసోడ్ లో, సుధీర్ మరియు ప్రదీప్ పండించిన కొన్ని సరదా ఘట్టాలు షోలో వారు అలానే జడ్జీలతో విపరీతంగా నవ్వులు పూయించాయి. నిజానికి షో మధ్యలో ప్రదీప్ తెలంగాణ బతుకమ్మ పాటను కొంత ప్యారడీ చేస్తూ డాన్స్ ఎలా వేయాలో నన్ను చూసి నేర్చుకో అంటూ సుధీర్ కి సవాలు విసురుతాడు. దానికి బదులిచ్చిన సుధీర్, నాకు నీఅంతగొప్పగా డాన్స్ రాదు, అయితే నువ్వు వేసి చూపించు నేను వేస్తాను అని అంటాడు.
దానికి ప్రదీప్ బ్యాక్ గ్రౌండ్ లో పేరడీగా వచ్చే బతుకమ్మ పాటకు రకరకాల స్టైల్స్ లో డాన్స్ వేస్తూ, ఇలా నువ్వు కూడా వేయాలి లేకపోతే ఓడిపోయినట్లే అని చెప్పడంతో సుధీర్, రష్మీ లు ఆ పాటకు గమ్మత్తైన స్టెప్పులు వేసి షోలో మంచి ఎనర్జీ ని నింపుతారు. అయితే ఈ ఘట్టమే ప్రస్తుతం ప్రజల నుండి వ్యతిరేకతకు కారణం అవుతోంది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఎంతో పవిత్రంగా భావించి పాడుకునే అమ్మవారి పాటైన బతుకమ్మ పాటను అపహాస్యం చేస్తూ సుధీర్, రష్మీ, ప్రదీప్ తమకు ఇష్టం వచ్చినట్లుగా డాన్స్ చేయడం, తెలంగాణ ప్రజల మనోభావాలను ఒకరకంగా దెబ్బతీయడం అని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వారు ముగ్గురిపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అది  వారు ముగ్గురు కేవలం హాస్యం కోసమే అలా చేసారని, అందులో తప్పులు ఎంచకండి అంటూ మరికొందరు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here